బ్యాటింగ్ చేయలేదు.. ఫీల్డింగ్ వల్ల కాదు.. ఈమె పాక్ జట్టు లో పీమేల్ రౌఫ్….
ఉమెన్స్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఘోర ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ జట్టు ఆడిన రెండు మ్యాచ్లలో ఓడిపోయింది….
బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైతే.. భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో 88 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొత్తంగా పాయింట్ల పట్టికలో అధమ స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ విఫల ప్రదర్శన చేసింది. బౌలింగ్లో చేతులెత్తేసింది. బ్యాటింగ్లో కూడా అదే ధోరణి కొనసాగించింది. ఫీల్డింగ్లో కూడా నిరాశజనకమైన ప్రదర్శన చేసింది.
పాకిస్తాన్ జట్టు ప్లేయర్లలో సీదారా అమీన్ చేసిన 81 పరుగులే టాప్ స్కోర్ కావడం విశేషం. మిగతా ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. ఏమాత్రం అంచనాలు అందుకోకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అమీన్ కు పెర్విజ్(33) కాస్తలో కాస్త సహకారం అందించింది. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. భారత జట్టులో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరి 3 వికెట్లు సాధించారు. వీరిద్దరి దూకుడు వల్ల పాకిస్తాన్ జట్టు ఏమాత్రం కోలుకోలేకపోయింది. ఏ దశలో కూడా లక్ష్యాన్ని సాధించే దిశగా కనిపించలేదు.
భారత్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో పాకిస్తాన్ ప్లేయర్ నషార సందు ఓవరాక్షన్ చేసింది. మైదానంలో ఫిమేల్ రౌఫ్ లాగా ప్రవర్తించింది. ఈమె బౌలింగ్లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఫీల్డింగ్లో విఫలమైనప్పటికీ.. మెడ వంకర చేసి భారత ప్లేయర్లపై కోపాన్ని ప్రదర్శించింది. ఫీల్డింగ్ లో ఒక క్యాచ్ నేలపాలు చేసింది. బ్యాటింగ్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నాటౌట్ గా నిలిచింది. తన ప్రదర్శన అంత గొప్పగా లేకపోయినప్పటికీ మైదానంలో ఓవరాక్షన్ మాత్రం ఒక రేంజ్ లో చేసింది. భారత ప్లేయర్లను కోపంతో చూడటం.. మైదానంలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడంతో వార్తల్లోకి ఎక్కింది.
ఇటీవల ఆసియా కప్ జరిగినప్పుడు టీమ్ ఇండియా ప్లేయర్ లపై కూడా పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రౌఫ్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. బౌలింగ్ సక్రమంగా వేయకపోయినప్పటికీ భారత ఆటగాళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్లేయర్లు మాత్రం అతడికి ఆటతోనే సమాధానం చెప్పారు. ఫైనల్ మ్యాచ్లో కూడా కట్టుదిట్టంగా బంతులు వేయకుండా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. అతని బౌలింగ్లో లోపాలను అర్థం చేసుకున్న టీమ్ ఇండియా బ్యాటర్లు దుమ్మురేపారు. బీభత్సంగా పరుగులు సాధించారు.
ఇప్పుడు నసారా కూడా అలానే వ్యవహరించింది. సేమ్ రౌఫ్ లాగే ప్రవర్తించింది. వంకర మెడలతో అర్దం లేని కోపాన్ని ప్రదర్శించింది. చివరికి టీమ్ ఇండియా గెలవడంతో నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు. బ్యాటింగ్లో విఫలం.. ఫీల్డింగ్లో విఫలం.. ఆటిట్యూడ్ మాత్రం అద్భుతం.. ఇలాంటి ప్లేయర్లు బహుశా పాకిస్తాన్ జట్టులోనే ఉంటారని నెటిజన్లు పేర్కొంటున్నారు.