జూబ్లిహిల్సు ఎన్నికలు త్రిముఖ పోటీ .. !? ద్విముఖ పోటీ..!?


ఎన్ని పార్టిలు పోటి చేసినప్పటికి జూబ్లిహిల్సు డిసైడ్‍ ఫ్యాక్టర్‍ చంద్రబాబే..?
నవంబరులో జరగనున్న జూబ్లిహిల్సు ఉప ఎన్నికల్లో BRS , కాంగ్రెస్‍ , BJP, TDP & Jenasena
పార్టీలతోపాటు తిన్మార్‍ మల్లన పార్టీ అభ్యర్థి , తెలంగాణ జాగృతి కూడా ఎన్నికల్లో పోటి కి
దిగునున్నట్టు తెలుస్తుంది.

ఎంత మంది పోటి చేసిన తుది పోటి మాత్రం BRS & కాంగ్రెస్‍ పార్టిల మద్యనే ఉంటుంది కానీ
డిసైడ్‍ ఫ్యాక్టర్‍ మాత్రం చంద్ర బాబు దే.
అదేంటి తెలంగాణ రాజకీయలకు చంద్రాబాబు దూరం గా ఉన్నాడు కదా ..! ?
మరీ చంద్రబాబు ఎట్లా డిసైడ్‍ ఫ్యాక్టరు అవుతాడో చూద్దాం

వాస్తవానికి ఈ ఎన్నిక అనేది త్రిముఖ పోటి ( BRS – కాంగ్రెస్‍ – NDA కూటమి) గా ఉండాలి కానీ
NDA కూటమి బాగస్వామ్య పార్టీ BJP – TDP లు వేరు వేరు వేరుగా చేయనున్నది అని తెలుస్తుంది.
పట్టణ స్థాయిలో పెద్ద ఓటు బ్యాంకు ఉన్న BJP తన సత్తా చాటుకునేందు అవకాశం ఉన్నప్పటికి
చంద్రాబాబు ఎత్తుగడ వలన BJP అనుహ్యంగా ఎన్నికల రేసునుంచి తప్పుకున్నట్టుగా
బావించవచ్చు.
ఇది తెలంగాణ BJP చేస్తున్న మరో చారిత్రాత్మక తప్పిదం. గతం అసెంబ్లి ఎన్నికల సమయాన
చేసిన పోరపాటుకు BJP బారీమూల్యం చెల్లించుకున విషయం మనకు తెలిసిందే కదా..?

గత అసెంబ్లి ఎన్నికల సమయాన చంద్రబాబు అమలు చేసిన వ్యూహాలు :
1) TDP పోటి చేయకుండా ఉండటం … పోటి చేస్తే చంద్రబాబు ను బూచిగా చూపి KCR

లాభపడుతాడు అని పోటి చేయలేదు

2) TDP పోటి చేయకుండా అవసరమైన చోట జనసేన అభ్యర్థులను పోటిలోకి దింపాడు

3) షర్మిళ పోటి నుంచి తప్పుకోవడంలో తెరవెనక బాబుగారు చక్రం తిప్పడంతో నెగెటివ్‍
ఓట్లు చీలకుండా చూసాడు.
ఇలా పై మూడు వ్యూహాలతో గత అసెంబ్లి ఎన్నికల సమయాన BRS పార్టీకి ఉన్న

వ్యతిరేకత ఓటు చీలకుండా చేసారు .

o BRS పార్టికి ఇప్పటి జూబ్లిహిల్సు ఎన్నికలు గతం అసెంబ్లి ఎన్నికలకంటే

o బిన్నంగా ఉంది. జూబ్లిహిల్సు BRS కు సిట్టింగ్‍ సీటు -సానుభూతి తో పాటు

రేవంత్‍ రెడ్డి వ్యతిరేకత తో BRS కు పాజిటివ్‍ ఓటు అధికంగా ఉంది

o రేవంత్‍ రెడ్డీ ,చంద్రబాబుల ఉమ్మడి రాజకీయ శత్రువు BRS గెలవకూడదు

అంటే BRS కు ఉన్న ఈ పాజిటివ్‍ ఓటును చిల్చాలి అందుకోసమే ఎన్నికల్లొ

పోటి దారులు ఎక్కువ ఉండేలా BJP ,TDPలు తిన్మార్‍ మల్లన్న పార్టీ, MIM

ఇంకా ఇతర రెబుల్‍ అభ్య్రర్థులను బరిలోకి ఉండేలా చూసుకుంటున్నారు.

o 2023 ఎన్నికల సమయాన BRS కు నెగిటివ్‍ ఓటును చీలిపోకుండా వ్యూహాలు

రచించిన చంద్రబాబు జూబ్లిహిల్సు ఎన్నికల సమయాన BRS పాజిటీవ్‍ ఓటును

చీల్చేలా వ్యూహాలు రచిస్తున్నాడని అంచనా.

ఈ జూబ్లిహిల్సు ఎన్నకల్లో TDP గెలవకపోవచ్చు కానీ డిసైడ్‍ ఫ్యాకరుగా ఉంటూ
రాబోయే 2028 ఎన్నికల సమయాన … తెలంగాణ కు TDP ప్రత్యామ్నాయం అనే
సంకేతాలు ఇవ్వడానికే అని అర్థం చేసుకోవచ్చు

About The Author