ఆంధ్రప్రదేశ్ భూధార్ ప్రయోజనాలు…
భూధార్ ప్రయోజనాలు
భూమి యొక్క యజమాని తన భూమి యొక్క భూధార్ మరియు దాని సంబంధిత సమాచారాన్ని అంగీకరించినప్పుడే భూధార్
ప్రమాణీకరించబడినట్టు అవుతుంది.
అటువంటి భూధార్ కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి:భూమి యొక్క స్థితి నిర్ధారణ
సమాచారం ముందుగానే పరిశీలించి ధృవీకరించబడుతున్నది కాబట్టి, భూధార్ ఉన్న భూములకు – అనేక ఆధారములు, ధ్రువ పత్రములు
సమర్పించాల్సిన అవసరం లేదు
భూసేవ లో దరఖాస్తుల స్థితి ఎప్పుడైనా ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు
భూసేవ పోర్టల్ నుండి సేవల యొక్క ఫలితాన్ని డౌన్లోడ్ ద్వారా పొందవచ్చును.
ల్యాండ్ పార్శిల్స్ సమాచారం గురించి ప్రజలకు తిరుగులేని నిజనిర్ధారణ కలిగిన సమాచారం అందించుట .
సేవలకు సంబంధించి ముందస్తు సమాచారం సంబంధిత దరఖాస్తుదారులు అందుకుంటారు
సంబంధిత ల్యాండ్ పార్శిల్ యొక్క మునుపటి చరిత్ర సులభంగా తెలుసుకోవచ్చును.
భూధార్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
భూధార్ అంటే ఏమిటి?
జాతీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ విధానాలను అంచనా వేసి భూధార్ యొక్క ఆకృతి రూపకల్పన చేయడమైనది. 11 అంకెల సంఖ్యను ఉంచడానికి నిర్ణయం తీసుకోబడింది, ఇక్కడ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్ కోసం కేటాయించబడతాయి.
భూధార్ ఎలా కేటాయించబడుతుంది
తన భూభాగంపై ‘భూధార్ కేటాయింపు’ కోసం పౌరడు దరఖాస్తు చేసుకున్నప్పుడు – సంబంధిత భూవ్యవహారాల విభాగం అక్ష్యాంశాల పై భూధార్ కేటాయించును.
భూధార్ యొక్క లక్షణాలు ఏమిటి?
అన్ని రకాల సర్వే వ్యవస్థలకు ఒకే సాఫ్ట్ వేర్.
భూధార్ ద్వారా రికార్డులోని సమాచారాన్ని భూమి పైగల వాస్తవిక సమాచారం కలిగిన పటములకు అనుసంధానం చేసుకోవచ్చును.
ఇది సర్వే సబ్ డివిజన్ వంటి రోజువారీ లావాదేవీలకు నేరుగా చేయుటకు వీలు కల్పిస్తుంది.
ఇది మ్యాప్‌లను వీక్షించడానికి మరియు ముద్రించడానికి సేవలు అందిస్తుంది.
డేటాబేస్ విధానం: ఎప్పుడైనా / ఎక్కడైనా అందుబాటులో ఉండే భూపటములు (Maps).
ప్లాట్‌ఫారమ్ స్వతంత్రత : ఇది Windows / Linux లో పనిచేయడానికి మద్దతు ఇస్తుంది.
NEXTBhu Seva (భూసేవ) Website – Bhu Seva APP/APK Download @ bhuseva.ap.gov.in »
[04/02, 10:54 AM] Ganesh Tirupati: జాతీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ విధానాలను అంచనా వేసి భూధార్ యొక్క ఆకృతి రూపకల్పన చేయడమైనది. 11 అంకెల సంఖ్యను ఉంచడానికి నిర్ణయం తీసుకోబడింది, ఇక్కడ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్ కోసం కేటాయించబడతాయి.
ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ప్రకారం 28 రాష్ట్రం యొక్క సెన్సస్ కోడ్. భూధార్ సంఖ్య రాష్ట్ర కోడ్ 28 తో మొదలవుతుంది, దీని తరువాత 9 అంకెలు ‘యాదృచ్ఛిక’ సంఖ్యను అనుసరిస్తుంది.
భూవిభాగపు ప్రాధమిక వివరములు మరియు పట్టాదార్ / యజమాని యొక్క సమాచారముతో 99 సంఖ్యతో మొదలయ్యే తాత్కాలిక భూధార్ కేటాయించబడుతుంది.
భూవిభాగపు ప్రాధమిక వివరములు, భౌగోళిక అక్ష్యాంశాలు మరియు పట్టాదార్ / యజమాని యొక్క సమాచారముతో 28 సంఖ్యతో మొదలయ్యే శాశ్వత భూధార్ కేటాయించబడుతుంది.
తాత్కాలిక భూధార్ సంఖ్య నమూనా : 99.xxx.xxx.xxx
శాశ్వత భూధార్ సంఖ్య నమూనా : 28.xxx.xxx.xxx
ప్రభుత్వ ఆస్తులకు అందించే తాత్కాలిక భూధార్ సంఖ్య నమూనా : 99.00x.xxx.xxx
ప్రభుత్వ ఆస్తులకు అందించే శాశ్వత భూధార్ సంఖ్య నమూనా : 28.00x.xxx.xxx
భూ విభాగము / ఆస్తి పై జరిగే ప్రతి లావాదేవీ తో భూధార్ సంఖ్య మార్చబడుతుంది మరియు ఆ భూ విభాగమునకు / ఆస్తికి ఇంతకు ముందు అందించిన భూధార్ సంఖ్య నిరుపయోగమవుతుంది.