శ్రీవారి భక్తుల మొర ఆలకించిన కలియుగ వెంకటేశ్వరస్వామి!!
శ్రీవారి భక్తుల మొర ఆలకించిన కలియుగ వెంకటేశ్వరస్వామి!!
అమరావతిలో ఆలయ నిర్మాణ స్థలం కొరకు 25 ఎకరాలు కొనుగోలు కోసం ఎకరా సబ్ రిజిస్టర్ రేటు 23 లక్షలు ఉంటే అధికంగా 50 లక్షల చొప్పున శ్రీవారి నిధులు 12.50 కొట్లు (CRDA) క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి చెల్లించడం తప్పు అని ఓ భక్తునిగా తాను హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసు నుంచి తప్పించుకున్నారు కానీ వెంకటేశ్వరస్వామి కోర్టులో తప్పించుకోలేకపోయారు!!
సీఎం ఆదేశాలతో టీటీడీ ఈవో గారు సిఆర్డిఏ కు చెల్లించిన 12.50 కొట్లు తిరిగి వెంకటేశ్వరుని అనుగ్రహంతో టిటిడి ఖాతాలోకి జమ కావడం దైవానుగ్రహం!! శ్రీవారి భక్తుల విజయం !! అలిపిరి పాదాల మండపం వద్ద వెంకన్నకు 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాము!!
నవీన్ కుమార్ రెడ్డి
శ్రీవారి భక్తుడు
ఓం నమో వెంకటేశాయ గోవిందా