నేనింతే…
#నేనింతే
ఒక వ్యక్తి ఆటిట్యూడ్‌లో మార్పును పెర్సువేషన్ అంటారు. నిరంతరం మనిషిలో మార్పు సంభవిస్తునే ఉంటుంది. అది ఏ దిశగా అనేది వ్యక్తి చుట్టూ ఏర్పడే పరిస్థితులను బట్టి ఉంటుంది. కాని మనిషి తనకు తాను ఎప్పటికీ ఒకే విధంగా ఉంటాను అని భావిస్తాడు. అలా ఉండాలని భావిస్తూ, అలాగే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నేనింతే నేను మారను. నేను నాకు లాగానే ఉంటాను అని తరచూ చెబుతుంటాడు.
ఎవరయినా మార్పు కోసం ప్రయత్నిస్తే మరింత వ్యతిరేకిస్తాడు. తను అనుకుంటున్న వ్యక్తిత్వాన్ని నిలుపుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎదుటి వాల్లు చెప్పే కొద్ది తను బిగుసుకు పోతుంటాడు. దానినే ‘రెసిస్టేన్స్ ఆఫ్ ద పెర్సువేషన్’ అంటారు.
ఇటువంటి వారు తమకు తెలియకుండానే తన ఆటిట్యూడ్‌కి వ్యతిరేకంగా ఉన్నవారిని నెగెటివ్ పీపుల్‌గా పరిగణించి, టైం వేస్టర్స్, సిల్లీ ఫెలోస్ అంటూ దూరం పెడతారు. పాజిటివ్ పీపుల్‌తో కలవాలని తన ఆటిట్యూడ్‌ని బలపరిచే వారితోనే స్నేహం చేస్తారు.
కౌన్సిలింగ్ ఇచ్చేటపుడు క్లయింట్‌కి రెసిస్టేన్స్ ఆఫ్ ద పెర్సువేషన్ ఎంతుందో గమనించాలి. సాదారణ MBTI పర్సనాలిటీ టెస్ట్ లో అర్థమవుతుంది. లేదా మొదటి సెషన్స్ లో జరిగే కన్వర్సేషన్స్ లో అర్థం చేసుకోవచ్చు.
ఎవరికయితే రెసిస్టేన్స్ ఆఫ్ ద పెర్సువేషన్ అధికంగా ఉందో వారిని కౌన్సిల్ చేసేటపుడు డైరెక్ట్ గా అతని ఆటిట్యూడ్‌కి వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ చెయ్యకూడదు. కౌన్సిలర్ మాట్లాడే ప్రతీ మాటలోనూ ఆ వ్యక్తి తనను ఎక్కడ మార్చడం కోసం ప్రయత్నం జరుగుతుందో అనే భయంతో తనను తాను డిఫెండ్ చేసుకుంటాడు. కొందరు తమ ఆటిట్యూడ్‌కి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలను చదవటానికి కూడా ఇష్టపడరు.
#HariRaghav గారు మానసిక వైద్య నిపుణులు, హైద్రాబాద్తుంది. లేదా మొదటి సెషన్స్ లో జరిగే కన్వర్సేషన్స్ లో అర్థం చేసుకోవచ్చు.
ఎవరికయితే రెసిస్టేన్స్ ఆఫ్ ద పెర్సువేషన్ అధికంగా ఉందో వారిని కౌన్సిల్ చేసేటపుడు డైరెక్ట్ గా అతని ఆటిట్యూడ్‌కి వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ చెయ్యకూడదు. కౌన్సిలర్ మాట్లాడే ప్రతీ మాటలోనూ ఆ వ్యక్తి తనను ఎక్కడ మార్చడం కోసం ప్రయత్నం జరుగుతుందో అనే భయంతో తనను తాను డిఫెండ్ చేసుకుంటాడు. కొందరు తమ ఆటిట్యూడ్‌కి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలను చదవటానికి కూడా ఇష్టపడరు.
HariRaghav గారు మానసిక వైద్య నిపుణులు, హైద్రాబాద్