రాశిచక్రంలోని అర్థాలు …


రాశిచక్రంలోని మిథునరాశి
గౌరిశంకరస్వరూపం , వృషభరాశి
నందీశ్వరునికి ప్రతీక. , రాశిచక్రం ఉదయించే
సమయంలో వృషభరాశి , మిథునరాశికి
కిందుగాను : అస్తమించే సమయంలో
మిథునరాశి, వృషభరాశికి కిందుగాను
ఉంటుంది, ఆ. కారణంవల్లనే శివుడు
వృషభవాహనుడూ , వృషభధ్వజుడూ
అయ్యాడు , నందికొమ్ములమీదనుంచి
శివదర్షనం చేయడంలోని అంతరార్థమదే !!
మిథునరాశిలోని అర్థ్రానక్షత్రం
రుద్రునికి సంకేతం ……
శివుడు లయకారుడు ,
అగ్నినే మూడవనేత్రంగా కలవాడు ,
అటువంటిముక్కంటికంటే కెదురుగా వెళ్ళడం ,
తీక్షణమైన. శివతేజస్సుకు ఎదురుగా వెళ్ళడం
మంచిది కాదని , శివునికి —
నందికి మధ్యగా వెళ్ళడం పనికిరాదని
నిషేధించారు ,
శివునికి అత్యంతప్రీతిపాత్రుడైన
నందీశ్వరుణ్ని దర్శించి , ఆయన అనుమతితో
శివుని అనుగ్రహాన్ని పొందవవలసిందని
ఆదేశించారు ….
వృషస్య వృషణ౦ స్పృష్ట్వా శ౦కర స్యావలోకనమ్, శృ౦గమధ్యే శివ౦ దృష్ట్వా
కైలాసం భవతి ధ్రువమ్ !!
భావ౦ : వృషభ౦ (న౦దీశ్వరిని) యొక్క
షృష్ఠభాగాన్ని స్పృశిసూ శ౦కరుణ్ణి దర్మి౦చడ౦
విధివిహిత౦. న౦దీశ్వరునికొమ్ముల మధ్యనుంచి
శివుణ్ణి చూచినవాళ్లకు నిశ్చయంగా కైలాసప్రాప్తి
కలుగుతుంది – అని చెప్పబడింది. అ౦దువల్లనే,
న౦దీశ్వర! నమ స్తుభ్య౦ సా౦బాన౦దప్రదాయక! , మహాదేవస్యసేవార్ధ౦
అనుజ్ఞా౦ దాతు మర్హసి! !
” సా౦బశివునికి ఆన౦దప్రదుడవైన ఓ
న౦దీశ్వరా! నీకు నమస్కారం. మహాదేవుణ్ణి
సేవి౦చడానికై నాకు అనుజ్ఞ ప్రసాదించు” –
అని న౦దీశ్వరుణ్ణి ప్రార్ధి౦చి – తర్వాతనే
పార్వతీ పరమేశ్వరులను సేవి౦చాలి.
ఓం నందీశ్వరాయనమః …..

About The Author