రోమ్ నగరమా – రామ నగరమా ?
ఐరోపా ఖండంలో అత్యంత ప్రాచీన నగరం, ఇటలీ దేశపు రాజధాని అయిన ‘రోమ్ నగరం’. 7 B.C.E లో పురాతన ‘ఎట్రుస్కన్ నాగరికతకు’ చెందిన మొదటి తరం వారు ఈ రోమ్ నగర స్థాపకులు. గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈ నగరం 21 ఏప్రిల్ 753 B.C.E లో నిర్మించబడింది. మరి ఆ తేదీకి ఉన్న ప్రాముఖ్యత తెలుసా ? చరిత్రలో ఆ రోజు ‘శ్రీరామ నవమి’. ఆ రోజే ‘రోమ్ నగర’ నిర్మాణానికి పునాది పడింది. ఈ ఎట్రుస్కన్ నాగరికత ప్రజలు సనాతన ధర్మాన్ని ఆచరించేవారని నిన్నటి పోస్టులో చెప్పుకున్నాం మనం.
అయితే ఈ ‘ఎట్రుస్కన్ నాగరికత’ ఫరిఢవిల్లిన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 7 B.C.E కి చెందిన కొన్ని అపురూప చిత్రాలు బయట పడ్డాయి. ఆ చిత్రాలన్నీ రామాయణంలోని వివిధ సందర్భాలను గుర్తుకు తెచ్చేలా ఉండడం పురాతత్వ శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సీతా రాముల అరణ్య వాసం, వాలి సుగ్రీవుల సంవాదం వంటి ఎన్నో సందర్భాలను ఆ చిత్రాలు పోలి ఉన్నాయి. అంతేకాదు రోమ్ నగరానికి సరిగ్గా ఎదురుగా ‘రావెన్నా’ అనే మరొక నగరం ఉండడం ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాలి.
ఏడు కొండల నగరం – రోమ్
ఈ రోమ్ నగరం ఏడు కొండలపై నిర్మించారు. కాబట్టి రోమ్ నగరానికి మరో పేరు ‘City of Seven Hills’. అయితే భారతీయ యోగ శాస్త్రంలో ఈ ‘7’ అనే సంఖ్యకి చాలా పెద్ద ప్రాధాన్యతే ఉంది. మనిషి శరీరంలో ఆరు శక్తి కేంద్రాలు ఉండగా, ఏడవ శక్తి కేంద్రం బ్రహ్మ రంధ్రం వద్ద శిరస్సు పై భాగంలో ఉంటుంది. దీనిని ‘సహస్రార చక్రం’ అంటారు. యోగ మార్గంలో షట్చక్రాలను దాటుకుని కుండలినీ శక్తి సహస్రార చక్రానికి చేరుకుంటే మోక్ష ప్రాప్తి లభించినట్టు చెబుతారు. మన తిరుమల ఆలయం కూడా ఏడవ కొండ అనగా యోగ పరిభాషలో సహాస్రార చక్ర ప్రాంతంలో ఆ పరమేశ్వరుడైన వేంకటేశుడు కొలువై ఉన్నాడని మనకు తెలిసిన విషయమే. సనాతన ధర్మ పరాయణులైన ఎట్రుస్కన్ నాగరికత ప్రజలు అందుకే ఈ నగరాన్ని ఏడు కొండలపై నిర్మించారు. అంతేకాదు ఇటలీ దేశంలోనే ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రస్తుత క్రైస్తవ క్షేత్రం ఒకప్పటి శైవారాధన కేంద్రం అని మనం నిన్నటి పోస్ట్‌లో తెలుసుకున్నాం.
ఇలా ఒకప్పుడు ప్రపంచమంతా విలసిల్లిన సనాతన హిందూ ధర్మం, కలి ప్రభావంచే దుష్ట మతాల దాడులతో అంతరించిపోయి నేడు భారత్‌లో మాత్రమే ఆచరింపబడుతుంది.