వైసీపీలోకి సినీ న‌టుడు మోహ‌న్‌బాబు…

వైకాపా అధ్యక్షుడు జ‌గ‌న్ స‌మ‌క్షంలో ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్‌బాబు పార్టీ కండువా కప్పుకొన్నారు. పార్టీ త‌ర‌పున తాను ప్ర‌చారం చేస్తానని మోహ‌న్ బాబు న‌డుం ప్రకటించారు.

చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిపై అసంతృప్తితో ఉన్న మోహ‌న్‌బాబు.. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల కోసం తిరుప‌తి వ‌ద్ద విద్యార్థుల‌తో పాటు ఆందోళ‌న చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు మ‌నుషులు త‌న‌ను రెచ్చ‌గొడితే… ఆయన అస‌లు బండారాన్ని బ‌య‌ట‌ పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. చంద్ర‌బాబు అక్ర‌మాలు,అవినీతి గురించి బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మేన‌ని మోహన్‌బాబు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు…

About The Author