ఏ ఓటరును కూడా వదిలివేయడం జరగదు…


ఏ ఓటరును కూడా వదిలివేయడం జరగదు’, ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ వంటి నినాదాలతో ఎన్నికల ప్రక్రియను జన సామాన్యానికి, మరీ ముఖ్యంగా దివ్యాంగులకు మరింత చేరువచేసే చర్యలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల విభాగం ఆదివారం, మార్చి 31 ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వద్దగల పీపుల్స్ ప్లాజాలో ‘అవగాహన నడక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతను తెలియచేయడానికి, దివ్యాంగులకు కల్పిస్తున్న అనేక సౌకర్యాలపట్ల అవగాహన కల్పించడానికి, ఈ విషయంలో సమాజాన్ని మరింత చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు.
దీనిలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్, నగర పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీ కుమార్, రాచకొండ పోలీస్ కమీషనర్ శ్రీ మహేశ్ భగవత్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వి.సి.సజ్జనార్, ఎన్నికల కమీషన్ అదనపు సిఇఓ శ్రీ బుద్ధ ప్రకాశ్, జిహెచ్‌ఎంసి కమీషనర్ శ్రీ దానకిశోర్, ఎన్నికల కమీషన్ జాయింట్ సిఇఓ శ్రీమతి ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ మాణిక్ రాజ్, జిహెచ్‌ఎంసి జోనల్ కమీషనర్ శ్రీమతి హరిచందన, దివ్యాంగుల నోడల్ అధికారి శ్రీమతి శైలజ ప్రభృతులతో పాటూ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సమాజంలోని వివిధరంగాల ప్రముఖులు, 2వేలమంది దివ్యాంగులు, వారి ప్రయోజనాలకోసం కృషి చేస్తున్న సంస్థలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలవారు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు

About The Author