చీలలు , బోల్టులు , సూదులు మింగుతుంది…
చీలలు , బోల్టులు , సూదులు మింగుతుంది…
అరుదైన సైకలాజికల్ కండిషన్ అకుఫగియా వ్యాధి ఇది..
సైకలాజికల్ కండిషన్స్తో కొంత మంది బలపాలు, మట్టి ఇతరత్రా వస్తువులను తింటూ ఉండటం చూస్తుంటాం. కానీ ముంబైకి చెందిన ఓ మహిళ పదునైన వస్తువులను ఆరగించి ఆనారోగ్యానికి గురైంది. ఆమెకు ఆపరేషన్ చేసిన అహ్మదాబాద్ వైద్యులు ఆ మహిళ కడుపులో కిలోన్నర నట్లు, బోల్ట్లు, జ్యూవెలరీ వస్తువులను చూసి అవాక్కయ్యరు. ఆమె ఉదర గోడలను పిన్నిసులు గాయపరచడంతో సుమారు మూడు గంటలపాటు కష్టపడి ఆపరేషన్ చేసి నట్లు, బోల్ట్లతో పాటు జిప్పులు, హెయిర్ పిన్నులను తొలగించారు.
ఈ మహిళ అరుదైన సైకలాజికల్ కండిషన్ అకుఫగియాతో బాధపడుతుందని, ఈ వ్యాధితో బాధపడేవారు పదునైన వస్తువులను తింటారని వైద్యులు పేర్కొన్నారు. ఇలా ఆమె పదునైన వస్తువులు ఆరగించడంతో ఆమె కడుపు ధృఢంగా తయారైందని, ఊపిరితిత్తుల్లో పిన్నిసులు గుచ్చుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళా వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు.