జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ అమ్మకాల పై NCPCR నిషేధం…

పసిపిల్లల సౌందర్య రక్షణ ఉత్పత్తులకు పేరుగాంచిన ప్రముఖ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ అమ్మకాలు నిలిపేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను, జాతీయ బాలల హక్కుల పరిరకక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) ఆదేశించింది… పిల్లలకు హానిచేసే ఫార్మల్‌డీహైడ్‌ సదరు షాంపూలలో ఉన్నట్టు కనుగొన్నందునే అమ్మకాల నిలిపివేతకు ఆదేశాలిచ్చినట్టు ఎన్‌సీపీసీఆర్ ఛైర్మన్ ప్రియాంక్ కనూంగో తెలిపారు.

‘జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూలను రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ అధారిటీ పరీక్షించగా… అందులో పిల్లలకు హాని చేసే ఫార్మాల్‌డీహైడ్ ఉన్నట్టు తేలింది. ఆ కారణంగానే ఆ షాంపూ ఉత్పత్తుల అమ్మకాలని ఆపేయాలని ఐదు రాష్ట్రాలను కోరాం’ అని కనూంగో పేర్కొన్నారు.

నాణ్యతాప్రమాణాలు లేని ఉత్పత్తుల అమ్మకాలను ఎన్‌సీపీసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, పసి పిల్లల్ని కస్టమర్లుగా ఏ వాణిజ్య సంస్థ భావించరాదని, రేపటి దేశ భవిష్యత్తు నేటి పిల్లలపైనే ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. పిల్లల భద్రత ఎన్‌సీపీసీఆర్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని చెప్పారు ప్రియాంక్ కనూంగో

About The Author