జామకాయ గురించి సంపూర్ణ వివరణ –

జామచెట్టు దక్షిణ అమెరికాకు చెందినది. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కనిపిస్తుంది. ఇది ప్రాచీనకాలం నుంచి భారతదేశంలో ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఇది చలికాలంలో తేలికగా లభ్యం అవుతుంది. ఈ జాతిలో తెల్లజామకాయ , ఎర్ర జామకాయ అను రెండురకాలు ఉన్నాయి. తెల్ల జామకాయ ఎర్ర జామకాయ కంటే రుచిగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ మరియు వారణాశి లో పండే జామకాయలు గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.

గుణాలు –

జామకాయ అంగుళికరంగా , వగరుగా , తీపిగా ఉంటుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది . శరీరానికి చలువచేయును . పిత్తరసాన్ని ఎక్కువుగా ప్రవహించకుండా నిరోధిస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది . జీర్ణాశయంలో మండుతున్న అనుభూతిని తగ్గిస్తుంది . మానసిక బ్రాంతి , హిస్టీరియాలను నయంచేస్తుంది . దప్పికను తీర్చుతుంది. ఇది పేగులలోని పురుగులను నాశనం చేస్తుంది. ఉన్మాదం నుండి ఉపశమనం ఇస్తుంది.

జామకాయలో నీటి శాతం – 76.1 % , ప్రోటీన్ – 1.5 %, కొవ్వు – 0.2 % , కార్బో హైడ్రేట్లు – 14.5 % , క్యాల్షియం – 0.01 % , ఫాస్ఫరస్ – 0 .04 % , ఐరన్ – 1 మిల్లీగ్రాముల నుంచి 100 గ్రా , విటమిన్ C – 300 మిల్లీగ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఉంటుంది.

జామకాయ విటమిన్ C ని ఎక్కువ కలిగి ఉంటుంది. ఈ పండు మగ్గి మెత్తగా అయితే మాత్రం విటమిన్ C తగ్గుతుంది . జామకాయ తొక్క మరియు తొక్కకు దగ్గరలో ఉండే గుజ్జు ఎక్కువ మొత్తంలో విటమిన్ C ని కలిగి ఉంటాయి.

తీసుకునే విధానం –

జామకాయని బాగా నమిలి తినవచ్చు . కాని ఎక్కువ పోషకాలను పొందాలంటే రసం తీసుకోవాలి . ప్రతి 100 ml రసంలో 70 నుంచి 170 మిల్లీగ్రాముల విటమిన్ C ఉంటుంది.

జామకాయ మలబద్ధకాన్ని మంచి ఔషధముగా పనిచేయును . రక్తములోని మలినాలను తీసివేయును . కుష్టు ఇతరవ్యాధుల చికిత్సలో చాలా అద్భుతముగా పనిచేయును .

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author