షుగరు వ్యాధి గ్రస్తులకు చెప్పే ఆహార సూత్రాలు…


రుజిత దివేకర్ భారత దేశం లో ఎక్కువ వేతనం ఇవ్వబడుతున్న డైటీషియన్ .
జూనియర్ అంబానీ 108 కిలోల బరువు తగ్గేలా చేసిన వ్యక్తి
.
ఆమె షుగరు వ్యాధి గ్రస్తులకు చెప్పే ఆహార సూత్రాలు
( కొన్ని అందరకూ కూడా వర్తిస్తాయి )
.
1. మీకు స్థానికంగా దొరికే పండ్లను తినండి
.

అరటిపళ్ళు , ద్రాక్ష , సపోటా , మామిడి , ఏదైనా సరే !
పళ్ళు అన్నిటిలోనూ ఫ్రక్టోజు ఉంటుంది . మామిడి తినడం ఆపిల్ తినడం కంటే హానికరం కాదు . ఎందుకూ అంటే మామిడి మీకు లోకల్ , ఆపిల్ మీకు లోకల్ కాదు , ( ఆపిల్ కాశ్మీరు నుండి వస్తుంది , మామిడి మీకు లోకల్ గా దొరుకుతుంది )
.

.ఫ్రక్టోజు మీ గ్లూకోజును నియంత్రణలో ఉంచుతుంది కనుక మీరు పళ్ళను నిరభ్యంతరంగా తినండి

2 . మీరు గింజలనుండి వచ్చిన నూనెలను వాడండి
.
( వేరుశనగ నూనె , నువ్వులనూనె , కొబ్బరినూనె , ఆవనూనె ) పేకింగ్ లో వచ్చే vegetable నూనేలకన్నా ( ఆలివ్, రైస్ బ్రాన్ , refined ఆయిల్స్ ) మీరు ఆడించుకున్న ఆయిల్స్ మంచివి .

3. రుజిత ఎక్కువగా నెయ్యి గురించి చెబుతారు . ప్రతిరోజూ నెయ్యి ఎక్కువగా తినండి అంటారు ఆమె . ఏ ఆహారపదార్ధం లో నెయ్యి ఎక్కువగా తినవచ్చో దానిలో ఎక్కువగానూ దేనిలో తక్కువ తినాలో దానిలో తక్కువగానూ తినమంటారు ఆమె .
.
నెయ్యి వాడడం వలన కొలెస్టరాల్ తగ్గుతుంది .

4. మీ ఆహారం లో కొబ్బరి ఎక్కవగా వాడండి . అటుకుల పులిహార ( పోహా ) లో ఇడ్లీ , దోశల చట్నీ , అన్నం లో చట్నీ గా తినమని చెప్తారు
.
కొబ్బరిలో కొలెస్టరాల్ అస్సలు ఉండదు . మీ నడుము సన్నబదడేలా చేస్తుంది కొబ్బరి న్తారు ఆమె
.

5. మీరు ఓట్స్ గానీ, ధాన్యాలు గానీ టిఫిన్ గా తినవద్దు
.
అంటారు ఆమె . అవి పేకేజ్డ్ ఆహారం . అవి మనకు అవుసరం లేదు . వాటికి రుచీ పచీ ఉండదు , బోరు కొడుతూ ఉంటాయి , మనం మొదటి ఆహారం బోరు కొట్టకూడదు అంటారు రుజిత
.
Breakfast గా పోహా , ఉప్మా , ఇడ్లీ , దోశ , పరోటా తినమని ఆమె సలహా !

6. Farhaan Akhtar బిస్కట్ యాడ్ లో కొరికిన ప్రతి ముక్కలోనూ పీచు ఉంది అంటారు . మన ఇంటి పెంటలో కూడా పీచు ఉంటుంది . పీచుకోసం ఓట్స్ తినక్కరలేదు .
.
ఓట్స్ బదులు పోహా , ఉప్మా , ఇడ్లీ , దోశ ,
( Instead of oats, eat poha, upma, idli, dosa.)

7. మీ నోట్లో పళ్ళు ఉన్నంత కాలం జ్యూసులు త్రాగకండి . మీకు పళ్ళు ఉన్నది కూరలూ పళ్ళూ తినడానికే !

8. చెరుకు రసం మిమ్మల్ని డీ టాక్సిఫై చేస్తుంది . అది ఫ్రెష్ జ్యూస్ రూపం లో తాగినా చెరుకు ముక్కలు తిన్నా సరే !

9. pcos, thyroid – ఉన్నవారు శక్తి కారకాలూ , బరువు తగ్గేవీ అయిన వ్యాయామాలు చెయ్యండి
పేకేజీ ఆహారం వదిలిపెట్టండి

10. RICE – మామూలు తెల్లని అన్నం తినండి . బ్రౌన్ రైస్ తినవలసిన అవుసరం లేదు . అది ఉడికేటపుడు మీ కుక్కర్ కీ , ఉడికాక మీ పొట్ట కీ శ్రమను కలిగిస్తుంది . ఎందుకు ఆ శ్రమ ?

రైస్ యొక్క GI INDEX చాలా తక్కువ . అది పప్పు , పులుసు , పెరుగు వంటి వాటితో కలిస్తే దాని GI index మరింత్ తగ్గుతుంది
.
వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది .

B. రైస్ లో మినరేల్స్ ఉన్నాయి . కాబట్టి మీరు రోజుకు మూడుసార్లు కూడా తినవచ్చు .

11. ఎంత తినాలి ?
.
ఆకలిగా ఉంటె ఎక్కువ తినండి . మీ పొట్ట ఏమి చెప్తుందో దాన్ని బట్టి చెయ్యండి

12. మీరు రైస్ , చపాతీ రెండూ తినవచ్చు , లేదా ఒక్క రైస్ మాత్రమె తినవచ్చు . మూడుపూట్లా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి . మీ ఆకలిని బట్టి తినండి

13. మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు .
.
( నెయ్యి , రైస్ తినకూడదు అంటూ భయం వద్దు )
.
మీరు తినే ఆహారం మిమ్మల్ని మంచిగా ఫీల్ అయ్యేలా ఉండాలి
.

14. అయ్యబాబోయ్ ఎన్ని కేలరీలు తిన్నానో అని భయపడకండి , ఎంత పోషకాహారం తీసుకున్నానో అనేది చూడండి
NEVER look at CALORIES. Look at NUTRIENTS.
.

15. పిజ్జా , పాస్తా , బ్రెడ్ , బిస్కట్ , కేకులు అస్సలు తినవద్దు
No bread, biscuits, cakes, pizza, pasta
.

16. మిమ్మల్ని మీరు ప్రశ్నిచుకోండి
ఈ ఫుడ్ మా అమ్మమ్మ తినేదా ? మీ జవాబు ఎస్ అయితే భయం లేకుండా తినండి .
.

Ask yourself, is this the food my Nani & Dadi ate? If yes then eat without fear.

17. రుతువును బట్టి తినండి .
.
వర్షాకాలం లో పకోడీలు, జిలేబీలు లాంటివి తినండి . ఎందుకంటే ఆకలి రుతువును బట్టి ఉంటుంది . ఒక్కొక్క సీజన లో వేపుళ్ళు తినాలి . తినండి
Eat as per your season. Eat pakoda, fafda, jalebi in monsoon. Your hunger is as per season. Few seasons we need fried food, so eat them.

18. ఉదయాన్నే టీ మీ మొదటి ఆహారం గా తీసుకోకండి .
.
అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ త్రాగకండి . రోజులో రెండు మూడు సార్లు పంచదార వేసుకుని టీ త్రాగండి
( When not to have chai – tea – don’t drink tea as the first thing in morning or when you are hungry. Rest you can have it 2-3 times a day and with sugar. )
.

19. గ్రీన్ టీ త్రాగకండి . ఎల్లో టీ , గులాబీ టీ , నీలం టీ ఏమీ వద్దు .
NO GREEN tea please. No green, yellow, purple, blue tea.
.

20. మీ సాంప్రదాయ ఆహారం తీసుకోండి
( Eat ALL of your TRADITIONAL foods. )
.

21. నిలవచేసిన పేకేజీ ఫుడ్ / డ్రింక్స్ ఏమీ వద్దు
( Strictly NO to packaged foods / drinks.)

22. వ్యాయామం చెయ్యండి . వాకింగ్ చెయ్యండి . అరగడానికీ , ఆరోగ్యంగా ఉండడానికీ
( Exercise / Walk to digest & stay healthy.)

About The Author