ఏటీఎంలు మూతపడుతున్నాయ్…?
గత రెండేళ్లలో 6 వేలకు పైగా తగ్గుదల
*ఆర్థిక లావాదేవీలకు ప్రధానంగా నగదుపైనే ఆధారపడే మన దేశంలో మున్ముందు ఏటీఎంను వెతికి పట్టుకోవడం కష్టమయ్యేట్టుంది. ఎందుకంటే దేశంలో ఏటీఎంలు క్రమంగా మూతపడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి పెద్ద సంఖ్యలో తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి.*
*దేశంలో నగదు ఉపసంహరణ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ ఏటీఎంల సంఖ్య మాత్రం తగ్గుముఖం పడుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం.. గడిచిన రెండేళ్లలో ఏటీఎంల సంఖ్య 6,000కు పైగా తగ్గింది. ఈ మార్చితో ముగిసిన ఏడాది కాలంలోనే 5,000 మేర తగ్గాయి. ఇప్పుడున్న ఏటీఎం యంత్రాల నిర్వహణే తడిసి మోపెడవుతుండటంతో బ్యాంకులు వీటి సంఖ్యను పెంచడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.*
*చిన్న బ్యాంకులైతే వీటి నిర్వహణను వీలైనంతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏటీఎంల సంఖ్య తగ్గడం సమ్మిళిత ఆర్థిక వృద్ధి లక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే మోదీ సర్కారు ప్రవేశపెట్టిన జన్‌ధన్ పథకంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.*
*జన్‌ధన్ ఖాతాలు అధికంగా తెరిచిన గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల ఆవశ్యకత కూడా పెరిగింది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునే సాంకేతిక అవగాహన లేని గ్రామీణ భారతంలో ఏటీఎంలు తగ్గుముఖం పడితే ఖాతాదారులు, ముఖ్యంగా పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులంటున్నారు. వీరు ఆర్థిక లావాదేవీల కోసం ఆధారపడేది నగదుపైనే.*
*మున్ముందు మరింత తగ్గొచ్చు..*
*సాధారణంగా బ్యాంకులు తమ బ్రాంచీల వద్దే ఏటీఎం వసతిని కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రెండు ఏటీఎంలలో ఒకటి ఆ బ్యాంక్ బ్రాంచీ వద్దే ఏర్పాటై ఉంది. ఈమధ్య కాలంలో కొన్ని బ్యాంకులు చేపట్టిన శాఖల ఏకీకరణ చర్యలు కూడా ఏటీఎంల సంఖ్య తగ్గడానికి కొంతవరకు కారణమైంది.*
*?అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న తర్వాత ఎస్‌బీఐ 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం శాఖల సంఖ్యను 1,000 మేర తగ్గించుకుంది. డిజిటలైజేషన్ యుగంలో బ్యాంకుల బ్రాంచీల నిర్వహణ అవసరం కూడా తగ్గుముఖం పట్టవచ్చని, దాంతో ఏటీఎంల సంఖ్య మరింత తగ్గేందుకు అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.*
*బ్రిక్స్ దేశాల్లో మన దగ్గరే తక్కువ*
*అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నివేదిక ప్రకారం.. ప్రతి లక్ష మందికి అందుబాటులో ఉన్న ఏటీఎంల పరంగా చూస్తే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో తక్కువ యంత్రాలున్నది మన దగ్గరే.*
*తగ్గడానికి కారణాలు*
“`★ **ఏటీఎం వసతి కేంద్రాల నిర్వహణ, భద్రత నిబంధనలను ఆర్‌బీఐ మరింత కఠినతరం చేసింది. దాంతో బ్యాంకులకు వీటి నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగింది** “
“`★గత ఏడాది ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఏటీఎం సాఫ్ట్‌వేర్, యంత్రాల ఆధునీకరించాల్సి రావడంతో వీటి ఆపరేటర్లపై అదనపు భారం పడింది. కేవలం ఏటీఎంల నిర్వహణ సేవా రుసుము ద్వారానే ఆదాయం ఆర్జించే ఆపరేటర్లు ఈ అదనపు వ్యయాలను తిరిగి రాబట్టుకోలేకపోతున్నాయి.“`
“`★ఏటీఎంల నిర్వహణ కంటే తమ ఖాతాదారులు ఇతర బ్యాంకుల యంత్రాల నుంచి లావాదేవీలు జరిపినప్పుడు వాటికి ‘ఇంటర్‌ఛేంజ్’ ఫీజు చెల్లించడమే చౌకని కొన్ని బ్యాంకులు భావిస్తున్నాయట.“`