సిద్దిపేట సిగలో స్విమ్మింగ్ పూల్…
సిద్దిపేట సిగలో స్విమ్మింగ్ పూల్…
క్రికెట్, ఫుట్ బాల్, వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, కరాటే, కబడ్డీ, ఖోఖో, బాక్సీంగ్, థైక్వాండో, ఫెన్సింగ్, హ్యాండ్ బాల్, చెస్, అథ్లెటిక్స్ ఆటలకు సంబంధించిన ఎంతోమంది క్రీడాకారులు సిద్దిపేటలో ఉన్నారు. ఈ క్రీడలకు సంబంధించిన వసతులు, మైదానాలు సిద్దిపేటలో ఉన్నందునే వీరంతా వెలుగులోకి వచ్చారు. అయితే శారీరక ధారుడ్యంతోపాటు ఆరోగ్యాన్ని, అంతర్జాతీయ స్థాయి ఆటను అందించే స్విమ్మింగ్ పూల్ లేని లోటు మాత్రం సిద్దిపేటను వెంటాడుతూ ఉండేది. అందుకే మంత్రి హరీశ్ రావు గారు ప్రత్యేక శ్రద్దతో సిద్దిపేట స్టేడియం సమీపంలోనే అత్యాధునికమైన అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పూల్ ను రూ.5కోట్ల వ్యయంతో నిర్మించేలా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇలాంటి స్విమ్మింగ్ పూల్ సిద్దిపేటలో మాత్రమే ఉంది. ఇప్పటికే రాష్ర్ట, జాతీయ స్థాయి పోటీలకు ఈ స్విమ్మింగ్ పూల్ వేదిక కావడంతోపాటు అంతర్జాతీయ క్రీడాకారుల మన్ననలు పొందింది. క్రీడలతోపాటు తమకు, తమ పిల్లలకు ఈత నేర్చుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నదని ప్రతీరోజు ఆ స్విమ్మింగ్ పూల్ వద్ద సిద్దిపేట వాసుల ముచ్చట్లు వింటుంటే అర్థమవుతుంది.