హెలికాఫ్టర్ నుండి బోర్లాపడిన అమిత్ షా…

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బోర్లా పడ్డారు. దీంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతం దేశంలో ఉత్తరభారతంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవైయాలని ఆయన రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఇందులోభాగంగా, ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మిజోరం పర్యటనకు వెళ్లారు. అక్కడ హెలికాఫ్టర్‌లో నుంచి కిందికి దిగుతుండగా హెలికాఫ్టర్ మెట్లమీది నుంచి జారి బోర్లాపడ్డారు. ఆయన వెంట మరో ఇద్దరు ఉన్నారు. అమిత్ షా కింద పడింది చూసి వారు గబుక్కున పట్టుకుని పైకిలేపారు. ఆ తర్వాత అమిత్ షా తేరుకుని, తన బట్టలకు ఉన్న దుమ్మును దులిపుకుని మళ్లీ తన ప్రచారం కార్యక్రమానికి వెళ్లారు.అయితే, ఈ ఘటనలో అమిత్ షా‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, ఈ ఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు యువకులు సెల్ ఫోన్‌లో చిత్రికరించి సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అయింది.కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు అయ్యోపాపం అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే మిజోరాంలో ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 28వ తేదీన జరుగనుంది. వెస్ట్ తుయ్‌పూయ్‌ ప్రాంతంలో చక్మా తెగకు చెందిన గిరిజన ప్రజలు అధిక సంఖ్యలో ఉండటంతో చక్మా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు షా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

About The Author