చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్ అనే పేరు ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు…

చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్ అనే పేరు ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు
(నిరుపేద వికలాంగుని కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చిన రోజు)

Read n share ? కృష్ణాజిల్లా పెడన మండలం తోటముల గ్రామం NTR కాలనీ లో నివసించే వుట్ల శ్రావణ కుమార్ నిరుపేద (వికలాంగుడు) భార్య హేమలత ,ఆమె తల్లి, ఇద్దరు పిల్లలు మొత్తం ఐదుగురు ఉంటున్నారు..
శ్రావణ కుమార్(వికలాంగునికి) వచ్చే 7000రూ జీతం తో తల్లి,భార్య,కొడుకు,కూతురు బ్రతకాలి ..
తినడానికి కూడా ఒక పూట గడిస్తే ఒక పూట కష్టం గా ఉంది..
ముఖ్యం గా వారు ఉంటున్న తాటాకు ఇల్లు మట్టి గోడలు పడిపోయి వాటికి పాత చీరలు,టర్బన్ కవర్ అడ్డం పెట్టుకుని జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి లో ఉన్నారు..
ఇంట్లో వయసుకొచ్చిన మన చెల్లి లాంటి ఆడపిల్ల ఉంది.,వారికి ఉండటానికి నీడ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము అని వారి సమస్యని మన ముందర తీసుకుని వచ్చారు..ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నపటికీ ఫలితం లేదు.,అద్ది ఇంట్లో ఉండి గడిపే అవకాశం లేదు..
వారి ఇల్లు,వాతావరణం,వారి పరిస్థితు లు చూసి చలించి పోయిన నేను కొన్ని రోజుల వ్యవధిలోనే మా *చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్* సభ్యులతో చర్చించి వాళ్ళకి ఉండటానికి *ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని సంకల్పించి రోజుల వ్యవధిలో నే ఫౌండేషన్ donars సహాయముతో వారికి 80 వేల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వటం జరిగింది*

సహకరించిన మన అన్నయ్య చిరంజీవి గారి అభిమానులకి,మెగా మిత్రులకు,నా వ్యక్తిగత మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదములు

*5000రూ ఆర్థిక సహాయం చేయటం మొదలుకుని నేడు ఒక కుటుంబానికి నీడ కలిపించే స్థాయికి మన చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్ ని తీసుకువెళ్లిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం*

About The Author