గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జయంతి….


గుమ్మడి వెంకటేశ్వరరావుగారు పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా దానిని తన నటనతో తెలుగు ప్రజానీకాన్ని మెప్పించి వారి హృధయాలలో స్థిరస్తాయిగా నిలచిన మహానటుడు మన గుమ్మడిగారు.
పరిచయం :
• తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జూలై 9, 1927 – జనవరి 26, 2010) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
• 26-జనవరి , 2010 గుండెపోటు తో మరించారు .
• మొదటి సినిమా — అదృష్ట దీపుడు 1950 , చివరి సినిమా –ఆయనకిద్దరు
ప్రొఫైల్ :
• పేరు : వెంకటేశ్వరరావు , గుమ్మడి ,
• ఉరు : గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.
• పుట్టిన తేది : జూలై 9, 1927
• తండ్రి :బసవయ్య,
• తల్లి :బుచ్చమ్మ.
• భార్య : లక్ష్మిసరస్వతి (1944 లో వివాహము), (ప్రస్తుతం చనిపోయారు ).
• పిల్లలు : ఐదుగురు అమ్మాయిలు ,ఇద్దరు కొడుకులు , (ప్రస్తుతం ఒక అమ్మాయి చనిపోయారు ,)
• తోబుట్టువులు : తనతో నాలుగు అన్నదమ్ములు ,
• చదువు : యస్,యల్.యల్.సి . గుంటూరు హిందూ కాలేజీ లో బి.ఎ పూర్తి చేశారు. 1944లో ఎస్.ఎస్.సి ఉత్తీర్ణుడై కాలేజీలో చేరాడు. తల్లితండ్రులు చదువు చాలించి ఇంటిదగ్గర పొలం పనులుచూసుకోమని ఒత్తిడి చేసినా, వాళ్లని ఒప్పించి కొల్లూరు ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. ఈ దశలోనే ఈయన కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. పాఠశాలలో తెలుగు పంతులు జాస్తిశ్రీరాములు చౌదరి ఈయన్ను ఎంతగానో ప్రభావితము చేశాడు.

• మరణము : 26 , జనవరి -2010 . గుండెపోటు తో కేర్ హాస్పిటల్ లో మరణించారు .

జీవిత విశేషాలు
• గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు తెలుగునాట ఉన్నారంటే అది అతిశయమే. అద్వితీయమైన గుణచిత్రనటనతో ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా దానిని తన నటనతో పండించడం అతడికి కరతలామలకం. అన్ని రకాల వేషాలు ఆయన ధరించినా సాత్విక వేషాలలో ఆధిక్యత సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు. ఆంధ్రుల పంచకట్టులోని హందాతనాన్ని ప్రతిబింబించిన ఏకైక నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు.
• ఎన్ టి ఆర్ తో నటించిన తోడు దొంగలు (1954) మరియు మహామంత్రి తిమ్మరుసు (1962) సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. రాష్ట్రపతి బహమతి మొదటిదానికి రాగా, రెండవదానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహ నటుడుగా ఎంపికయ్యాడు. మాయా బజార్ (1957), మా ఇంటి మహాలక్ష్మి (1959), కులదైవం (1960), కుల గోత్రాలు (1962), జ్యోతి (1977), నెలవంక (1981), మరో మలుపు (1982),ఏకలవ్య (1982), ఈ చరిత్ర ఏ సిరాతో? (1982), గాజు బొమ్మలు (1983), పెళ్ళి పుస్తకం (1991) గుమ్మడికి పేరుతెచ్చిన సినిమాలలో కొన్ని. తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరుసు (1962)లో కథానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది
• జాతీయ సినిమా బహుమతులకు న్యాయనిర్ణేతగా మూడు సార్లు, రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా మరియు రెండు సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. ఎన్టిఆర్ అవార్డు మరియు రఘపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.
• ఆయన తనజీవిత చరిత్ర తీపిగుర్తులు చేదు జ్ఞాపకాలు అన్న పేరుతో రచించాడు.
• ఆయనకిద్దరు (1995) లో ఆరోగ్యం సరిగాలేక గొంతు సరిగా పనిచేయనప్పుడు, ఇతరుల గొంతు వాడటంఇష్టంలేక నటించటం మానుకున్నాడు. మరల జగద్గురు శ్రీ కాశినాయన చరిత్ర (2008) లో ఆయన వయస్సు మరియు గొంతు సరిపోతుంది కాబట్టి నటించాడు

మరి కొన్ని విశేషాలు
• గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన అర్ధాంగి చిత్రంలో ఆయనకు భార్యగా నటించిన శాంత కుమారి ఆయనకంటే 8 సంవత్సరాలు పెద్దది. అలాగే ఆయనకు పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు ఆయనకంటే 3 సంవత్సరాలు పెద్ద. ఆయన చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య ఆయన కంటే 1 సంవత్స్దరం పెద్ద.
• ఆరంభకాలంలో చిత్రాలలో నటించడానికి మద్రాసు వచ్చి తీసుకు వచ్చిన డబ్బులు అయిపోయి రెండు రోజుల మంచినీటితో సరిపెట్టుకున్నాడు. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పిన నిరాకరించి ఖర్చుల కొరకు తన పెళ్ళినాటి ఉంగరం తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకున్నాడు. ఆయన జీవితంలో ఆయన భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని ఆయనమాటల వలన తెలుసుకోవచ్చు.
• మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో ఎన్.టి.ఆర్ కృష్ణదేవరాయలుగా నటించినా చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాలలో ఓ అరుదైన ఘటన. అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది.
• గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా వున్న కాశీనాయన పాత్ర పోషించాడు.
• గుమ్మడి ‘చేదు గుర్తులు, తీపి జ్ఞాపకాలు’ పేరుతో జీవనస్మృతుల్ని అక్షరీకరించాడు. తొలి ముద్రణ ప్రతులన్నీ, కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు.
• నటుడిగా అవకాశాలు వచ్చినా ఆధునిక చిత్రసీమ యొక్క పోకడ నచ్చక చివరి కాలంలో నటనకు దూరంగా ఉన్నాడు.
గుమ్మడి పోషించిన పాత్రలు
• పురాణ పాత్రలు: బలరాముడు, భీష్ముడు, భృగుమహర్షి, దుర్వాసుడు, జమదగ్ని, కర్ణుడు, విశ్వామిత్రుడు, ధర్మరాజు, సత్రాజిత్తు, దశరథుడు
• చారిత్రాత్మక పాత్రలు:
పోతన, కబీర్ దాసు, తిమ్మరుసు, కాశీనాయన
సాంఘీక పాత్రలు:
దివాన్, డాక్టర్, ముఖ్యమంత్రి, వ్యవసాయదారుడు, న్యాయవాది, మునసబు, నందుడు, పోలీసు అధికారి, ప్రధానోపాధ్యాయుడు, జమీందారు
పురస్కారాలు
• 1998 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డు నిచ్చి సత్కరించింది.
• 1982 : మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డాడు.
• ఏడు సార్లు బెస్ట్ కారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ,
• తెలుగు యునివర్సిటీ నుండి డాక్టరేట్ ,
• పొట్టి శ్రీరాములు యునివర్సిటీ నుండి ‘కళాప్రపూర్ణ ‘ బిరుదు ,

About The Author