ఇన్సులిన్ ఓవర్ డోస్ ఇచ్చి భార్యను చంపేశాడు…

అతడి కోసం మొగుడు ఘాతుకం ..
ఇన్సులిన్ ఓవర్ డోస్ ఇచ్చి భార్యను చంపేశాడు..

బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన 34ఏళ్ల మహిళను భర్తే కిరాతకంగా చంపేశాడు. ఈ ఏడాది మేలో హత్య జరగ్గా కోర్టు భర్తే దోషి అని తాజాగా తేల్చింది. ఉత్తర ఇంగ్లండ్‌లోని మిడిల్స్‌బరో ప్రాంతంలో జెస్సికా అనే వివాహిత వారి ఇంట్లో చనిపోయి కనిపించింది. అయితే భర్త మితేశ్‌ పటేల్‌(37) తనకేమీ తెలియదని ముందు బుకాయించాడు. కానీ విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ హత్య చేసింది భర్త మితేశే అని పోలీసులు నిర్ధారించారు. మితేశ్‌ స్వలింగ సంపర్కుడని పోలీసులు గుర్తించారు. గే డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన బాయ్‌ఫ్రెండ్‌ కోసం మితేశ్‌ భార్యను హత్య చేశాడని వెల్లడించారు. స్వలింగ భాగస్వామితో కొత్త జీవితం మొదలుపెట్టాలని భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్నాడని తెలిపారు. మితేశ్‌ భార్యను కట్టేసి ఇన్సులిన్‌ అధిక మోతాదులో ఎక్కించి, తర్వాత ఆమెను ప్లాస్టిక్‌ కవర్‌తో ఊపిరాడకుండా చేసి చంపేశాడని విచారణలో తేలినట్లు దర్యాప్తు అధికారులు కోర్టులో ఆధారాలు చూపించారు.
మితేశ్‌ గతంలో ఇంటర్నెట్‌లో ‘నేను నా భార్యను చంపాలి’, ‘ఇన్సులిన్‌ ఓవర్‌డోస్‌’, ‘నా భార్యను చంపేందుకు పథకం కావాలి? మరొకరి సహాయం అవసరమా?’, ‘యూకేలో హిట్‌మ్యాన్‌ను ఎలా హైర్‌ చేసుకోవాలి?’ ‘ఎంత మొత్తం మెథడోన్‌ చంపేస్తుంది?’ అని రకరకాలుగా వెతికాడని విచారణలో పోలీసులు గుర్తించారు. అయితే మితేశ్‌ గే యాప్‌లో పలువురు అబ్బాయిలతో చాట్‌ చేయడం మందుల దుకాణంలోని ఉద్యోగులు చూసేవారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. భార్య దగ్గర దాని గురించి తెలియకుండా జాగ్రత్తపడేవాడని తెలిపారు. భార్యను హత్య చేసి వచ్చే బీమా డబ్బుతో ఆస్ట్రేలియా వెళ్లిపోయి అక్కడ తన బాయ్‌ఫ్రెండ్‌తో స్థిరపడాలని మితేశ్‌ నిర్ణయించుకున్నాడని వెల్లడించారు.

About The Author