తిరువనంతపురం లో శ్రీ అనంత పద్మనాభస్వామి…
శ్రీ అనంత పద్మనాభస్వామి వారు ఆదిశేషుడు అనే నాగును పాన్పుగా చేసుకొని శయనించి ఉండటం వలన ఈ పుణ్యస్థలానికి అనంతశయనము అనే పేరు వచ్చినది అని అంటారు. ఇక్కడ తన నాభి యందు బ్రహ్మదేవుడు కొలువు దీరిన పద్మాన్ని కల్గి ఉన్న శ్రీ మహావిష్ణువే అనంతపద్మనాభుడు. మరి ఈ స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తిరువనంతపురం లో అనంత పద్మనాభస్వామి కొలువై ఉండటానికి ముఖ్య కారకుడు బిల్వ మంగలుడు. అయితే ఇతడు కేరళలోని ధనిక మరియు సంప్రాదయబద్దమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొదట్లో బిల్వ మంగలుడు పూజలు చేస్తూ భక్తి మార్గంలో ఉండేవాడు. అయితే తన దగ్గర ఉన్న ధనం కారణంగా అతడు స్త్రీ వ్యామోహానికి, మద్యానికి బానిసయ్యాడు. ఆ తరువాత తన తప్పుని తెలుసుకొని అన్ని వదిలేసి కృష్ణుడిని ప్రార్థిస్తూ, కేవలం కృష్ణ నామం తప్ప మరో ద్యాస లేకుండా శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ గొప్ప కృష్ణ భక్తుడిగా మారిపోయాడు. అలా చాలా దూరం ప్రయాణించి ఒక అరణ్యంలోకి ప్రవేశించి కృష్ణుడిని ఆరాధిస్తూ ఉన్నాడు.
ఇలా ఉండగా ఒక రోజు అయన దగ్గరికి ఒక పిల్లవాడు రాగ, అతడికి ఆ బాలుడు బాగా నచ్చడంతో ఇక్కడే నాతో ఉండిపో అని అనగా, అప్పుడు ఆ పిల్లవాడు ఏ రోజు అయితే నీవు నన్నుమర్యాదగా చూసుకోవో ఆ రోజు నేను నిన్ను వదిలేసి అనంతకాడా అనే ప్రదేశానికి వెళ్లిపోతానని చెప్పడంతో దానికి ఆ భక్తుడు సరేనని చెబుతాడు.
ఒక రోజు ఆ భక్తుడు పూజలో ఉండగా ఆ పిల్లవాడు తన చేష్టలతో విసుగు తెప్పించడంతో బాలుడిని మందలించడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ భక్తుడు బాలుడిని వెతుకుంటూ అనంతకాడా అనే ప్రదేశానికి వెళ్లగా ఆ పిల్లవాడు అతని ముందే ఒక పెద్ద చెట్టులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ చెట్టు మహా వృక్షంలాగా మారి కిందపడి ఐదు పడగలు ఉన్న శేషు పాముల పవనిస్తున్న మహావిష్ణువు లా మారిపోవడంతో ఆ చిన్నపిల్లవాడే మహావిష్ణవు అని అర్ధం చేసుకొని నమస్కరించి ఆ విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరగా వెంటనే ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంగా మారింది. అప్పుడు ఆ కాలంలో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కులశేఖరుడు అనే రాజు, బిల్వమంగళుడు ఇద్దరు కలసి స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. అదే అనంతపదనాభస్వామి ఆలయం.
అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరునె తిరువనంత పురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్థుగా పెట్టుకున్నారు. ప్రస్తుత మున్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారు చేసారు. ఈ బారి విగ్రహాన్ని చూడ డానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషుని పై పవళించి నట్ల్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి.
సవరించు
శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ
కేరళ లోని తిరువాన్కూరు ఒక గొప్ప రాచరిక వ్వవస్థ. ఆరాజ్యం లోని అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరుననే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చినది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండ వర్మ చేతిలోకి వచ్చింది.
ఈ రాజ తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతము ఉన్న విశాలమైన (వైవిధ్యమైన) గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామ లతో తయారు చేసారు. ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషుని పై పవళించి నట్లు ఉన్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి.
ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి ఉన్నదని తెలుసు. ఈ గదులను అయితే కొన్ని వందల సంవత్సరాలుగా తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినా, ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్యవేక్షణ క్రిందనే ఉంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మ ను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ధర్మకర్త లుగా కొనసాగారు. ప్రస్తుతం ఉత్తరదామ్ తిరుణాల్ మార్తాండ వర్మ ధర్మకర్తగా కొనసాగుతున్నారు.