ప్రాణాలు బలికొన్న అకాలవర్షం..చేపల వేటకు వెళ్ళిన వ్యక్తి మృతి…


గజ ఈతగాళ్ళ సాయంతో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
అసలే లాక్ డౌన్ కాలం చేతిలో పనిలేదు.. చేబులో డబ్బుల్లేవ్ ..ఎట్లా బ్రతకాలిరా భగవంతుడా ..అనుకుంటూ చేపలవేటకు వెళ్ళిన ఒక వ్యక్తి ,ఈదుర గాలులతో‌కూడిన అకాల‌వర్షానికి గల్లంతై మృతి చెందిన ఘటన పిచ్చాటూరు లోని అరణియార్ రిజర్వాయర్ లో చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.
రెప్పలపట్టు గ్రామానికి చెందిన గోపి(40) శనివారం సాయంత్రం అరణియార్ రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్ళాడు.ఉన్నటుండి బలమైన ఈదురు గాలులతో కూడిన అకాలవర్షం రావడంతో పడవలో నుండి నీటిలోకి వలలు వదులుతూ పడవ బోల్తాపడి గోపి గల్లంతు అయినట్లు బంధువులు తెలిపారు.సమాఛారం అందుకున్న పోలీసులు గజ ఈత గాళ్ళ సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడు గోపికి భార్య,ఇద్ధరు పిల్లలు ఉన్నారు.కుటుంబ పోషణ భారమై చేపలవేటకు వెళ్ళి మరణించిన గోపి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

About The Author