తిరుపతిలోని ” అలిపిరి ” కి ఆ పేరు ఎలా వచ్చింది …

శ్రీవారి మహిమలు – యదార్థసంఘటనలు 

” తిరుమల ” కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న ” అలిపిరి ” ప్రాంతానికి చేరుకోవాలి. 

అక్కడినుంచి కాలినడకన లేదా రకరకాల వాహనాలలో మనం సప్తగిరుల పైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటాం. 

అయితే కొండ క్రింద ఉన్న ఈ    “అలిపిరి” కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు.

అసలు ” అలిపిరి ” అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా … ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ ” అలిపిరి ” అనే పదం లేదు. 

అయితే, ” అలిపిరి ” అనే ఈ పదం ఎలా పుట్టింది … ? 

దీని వెనుక చరిత్ర ఏమిటి … ?

అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం,” తిరుపతి ” నగరం ఇప్పటిలాగా లేదు.

ఇప్పుడు ” అలిపిరి ” అని పిలుస్తున్న ప్రాంతానికి-

“అలిపిరి” అన్న పేరు కూడా లేదు.

 మరి *” అలిపిరి ” అన్న పేరు ఎలా వచ్చిందో  పూర్తిగా చదివి తెలియనివారికి తెలియపరచాలని నా హృదయపూర్వక విజ్ఞప్తి.*అది ( 1656 – 1668 ) ప్రాంతం . ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన ” రాక్షసి తంగడి & తళ్ళికోట ” మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు.

ఈ నిజాం నవాబు, ఢిల్లీ సుల్తానుకు – కప్పం కడుతూ సామంతుడిగా పడి ఉంటూ, హిందువులపై నిరాఘాటంగా & ధారావాహికంగా అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు.

పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా – కుతుబ్ షా & వజీర్ల సైన్యం, ” ఆలీ ” అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత ” ఆలీ ” సైన్యం తిరుపతికి చేరుకుంది.అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం. ఇప్పుడు ” మంచినీళ్ళ కుంట ” అని చెప్పుకుంటున్న ” నరసింహ తీర్థమే ” అప్పటి తిరుపతి గ్రామం. ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని ” నరసింహ తీర్థం రోడ్ ” అనే పిలుస్తారు.

ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు : 

*ఒకటి :* శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అనీ & తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవమ్ విశ్వాసం భారత దేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన, ఈ దేవాలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ ” అల్లా ” యే గొప్ప దేవుడని భావించి, ” ఇస్లాం ” మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన.రెండోది :* శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని.

అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు, ” ఆలీ ” ( కమాండర్ ఇన్ చీఫ్ ) ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా ! మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ & పురుషుల వద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు. 

దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ & ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి, తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు.

సరిగ్గా ఇప్పుడు ” అలిపిరి ” అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే, శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి, దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు.

అప్పుడు , శ్రీ స్వామి వారి ” అమృత వాణి ” వాడికి వినబడింది, దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా ? ఎంత ధైర్యం … ? అని. అప్పుడు ఆలీ బిగ్గరగా రోదిస్తూ … క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్నాడు. అప్పుడు,దయార్ద్రచిత్తుడయిన స్వామి వారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు “ఆలీ”. ఉర్దూ లేక హిందీ భాషలో ” ఫిర్ నా ” అంటే వెనక్కి మళ్ళడం, ” ఫిరే ” ఆ ” అలి ఫిర్ ” నానాటికి ” అలపిరి “గా స్థిరపడింది.

*ఓం నమో వేంకటేశాయ*

 సేకరణ 

? వరలేఖరి.నరసింహశర్మ?

About The Author