జూన్ 21న శ్రీ‌వారి ఆల‌యంలో సూర్యగ్రహణం

తిరుమల, 15 జూన్‌ 2020జూన్ 21న ఆదివారం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. జూన్ 20వ తేదీ రాత్రి 8.30 గంట‌ల‌కు ఏకాంత సేవ త‌రువాత మూసిన శ్రీ‌వారి ఆల‌య తలుపులను జూన్ 21న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు తెరుస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తారు. అనంత‌రం మొద‌టి అర్చ‌న‌, మొద‌టి గంట‌, బ‌లి శాత్తుమొర‌, రెండో అర్చ‌న, రెండో గంట త‌దిత‌రాల‌ను ఏకాంతంగా చేప‌డ‌తారు. రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శుద్ధి, రాత్రి కైంక‌ర్యాలు, రాత్రి గంట, రాత్రి 8 నుండి 8.30 గంట‌ల ఏకాంతసేవ నిర్వ‌హిస్తారు. ఈ కైంక‌ర్యాల కార‌ణంగా జూన్ 21వ తేదీ నాడు పూర్తిగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు. క‌ల్యాణోత్స‌వం ఆర్జితసేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది. గ్ర‌హ‌ణం స‌మ‌యంలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించాల‌ని టిటిడి కోరుతోంది.

About The Author