ప్రధాని మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంభాషించనున్నారు. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో ఈ 21 రాష్ట్రాల్లో దాదాపు 5 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం 17 ప్రధాని మోడీ మాట్లాడనున్నారు.కరోనా కేసుల పెరుగుదల, రాష్ట్రాల భౌగోళిక స్థానాల ఆధారంగా రాష్ట్రాలను రెండు గ్రూపులుగా విభజించారు.ఈ జాబితాను ప్రధానమంత్రి కార్యాలయం గతవారం ట్విటర్‌లో షేర్ చేసింది. మొదటి రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వతప్రాంత రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా అసోంలో 4049, పంజాబ్ 3140, కేరళ2461లలో కరోనా కేసులు నమోదయ్యాయి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదివారం నాటికి ఈ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన మొత్తం యాక్టివ్ కేసులు18,000 లోపు ఉన్నాయి. 7,500 మంది కోలుకోగా, 130కి పైగా మరణాలు సంభవించాయి. సోమవారం ( జూన్15, 2020) నాటికి దేశంలోని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424కి చేరగా, మృతుల సంఖ్య 9,520కి పెరిగింది.ఇక రెండో రోజు ప్రధాని మోడీ సమావేశం కానున్న రాష్ట్రాల్లో దాదాపు 2.10 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశం మొత్తం కేసుల్లోని దాదాపు 65 శాతం వీటిలోనే నమోదయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు స్వస్థలాలకు తిరిగి వెళ్లడం వల్లే కరోనా కేసులు పెరిగినట్లు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. దేశంలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చలు జరుపడం ఇది ఆరోసారి.
(మార్చి 20, 2020) తొలిసారిగా సీఎంలతో ప్రధాని మాట్లాడారు. ఈసారి కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు తమ గళాన్ని గట్టిగానే వినిపించే అవకాశముంది. లాక్‌డౌన్ కారణంగా కుదేలైన తమకు కేంద్రం ప్రత్యక్ష సాయం అందించాలని, షరతులు లేని రుణాలు అందించాలని ప్రధాని మోదీని కోరనున్నాయి.కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎంలతో మాట్లాడిన తర్వాత ప్రధాని ఏం నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.