చోరీ కేసు ఛేదించిన రేణిగుంట జి.ఆర్.పి.ఎఫ్ పోలీసులు.

18,50,000 రూపాయల నగదు స్వాధీనం.

రేణిగుంట …చోరీ కేసులో నిందితులను ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశ పెట్టిన రేణిగుంట జి ఆర్ పి ఎఫ్ పోలీసులు. గత ఏడాది అక్టోబర్ 30 తేదీన, రేణిగుంట నుండి చెన్నై వెళ్తున్న గరుడాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో కడప జిల్లాకు చెందిన రేవూరి చౌడేశ్వర రావు అనే బంగారు వ్యాపారి 61 లక్షల 50 వేలు  రూపాయలతో రైల్లో ప్రయాణిస్తుండగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజేంద్రన్, సుబ్రమణి, ఆంటోని ముగ్గురు కలిసి నగదు సంచిని రైల్లో చోరీ చేశారు. బాధితుడు చౌడేశ్వర రావు ఇచ్చిన ఫిర్యాదుతో రైల్వే జీ.ఆర్పి,ఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రైల్వే డీజీపీ ద్వారక తిరుమల రావు, విజయవాడ రైల్వే ఎస్పీ విజయ రావు, డి.ఎస్.ఆర్.పి ఆదేశాలతో పలు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. వీరు నుండి 18 లక్షల 50 వేల రూపాయల నగదు, మొత్తం 23 లక్షల రూపాయల విలువ చేసే టివి, ఫ్రిజ్, బంగారు ఆభరణాలు సొత్తును స్వాధీనం చేసుకున్నాట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో, రైల్వే సి.ఐ నరసింహారాజు , ఎస్సైలు అనిల్ కుమార్, రవి ,ప్రవీణ్ కుమార్, రారాజు, రైల్వే ఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author