ముాడు రాజధానులు బిల్లు ను ఆమెాదించడం హర్షణీయం….వల్లభనేని సత్యనారాయణ..


పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ముాడు రాజధానులు బిల్లు ను గవర్నర్ గారు ఆమెాదించడం హర్షణీయం ఉయ్యూరు నగర పంచాయతీ వైఎస్ఆర్ సిపి ప్రతిపాదిత చైర్మెన్ అభ్యర్థి వల్లభనేని సత్యనారాయణ (నాని)

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ గారు ఆమెాదం తెలిపిన సందర్భంగా క్రిష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీ నందు వైఎస్ఆర్ పార్టీ ఆద్వర్యంలో ఆనందం వ్యక్తం చేస్తుా దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారి మరియు ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఉయ్యూరు నగర పంచాయతీ వైఎస్ఆర్ పార్టీ ప్రతిపాదిత చైర్మెన్ అభ్యర్థి వల్లభనేని సత్యనారాయణ (నాని) మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలలో అభివృద్ధికి సాద్యమని తెలియచేసారు ముాడు రాజధానులు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తుాంటే కేవలం చంద్రబాబునాయుడు ఆయన బినామీలు మాత్రమే ఒర్వ లేకపోతున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉయ్యూరు నాయకులు జంపాన కొండలరావు ,రాజులపాటి రామచంద్రరావు ,అబ్దుల్ రసుాల్,ప్రాకెర్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు .