ఏపీలో మందు బాబులకు శుభవార్త

జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత ఏపీలో ప్రతి ఏడాది మధ్యం షాపులను 20 శాతం తగ్గించుకుంటూ వెళుతూ మరొకవైపున మద్యం ధరలు సామాన్యుడికి షాక్ కొట్టే రీతిలో పెంచేశారు. లాక్ డౌన్ సమయంలో దాదాపుగా రెండు నెలలు పాటు మద్యం షాపులు మూసివేసి ఆ తరువాత ఎప్పుడైతే మద్యం షాపులను తెరిచారో అప్పటి నుంచి మద్యం ధరలను దాదాపుగా 90 శాతం పెంచేసి మద్యం ప్రియులకు కోలుకోలేని దెబ్బతీశారు. దీనితో చాలా మంది పేద వారు మద్యానికి డబ్బులు ఖర్చుపెట్టే స్థోమత లేక శానిటైజర్ లు తాగి మరణిస్తున్న ఘటనలు ఈమధ్య చోటుచేసుకున్నాయి.

ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మద్యం సరఫరా బీభత్సముగా జరుగుతుండటంతో మద్యం సరఫరాను కట్టడి చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.దీనితో అతి త్వరలో పెంచిన మద్యం ధరలను దాదాపుగా 30 నుంచి 40 శాతం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందట. దీనితో ఏపీలో ఇప్పుడు పెరిగిన ధరలతో పోలిస్తే క్వాటర్ పై 40 రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బ్రాండ్ల వారీగా మద్యం ధరలు తగగడంతో మధ్యం ప్రియులకు కాస్త ఊరట అని చెప్పుకోవచ్చు. దీనిపై తగు ప్రణాళిక రచించి మద్యం ధరలను తగ్గించాలని చూస్తున్నారు.

About The Author