మన పూర్వీకుల అపారమైన పరిజ్ఞానం ఎన్నో విషయాలలో ఎంతో విస్మయానికి గురిచేస్తుంది.


మిగతా ప్రపంచమంతా అంధకారంలో మగ్గుతూవుంటే , మనవారు ఎన్నో శాస్త్రాలలో ప్రావీణ్యులు.
అంతరిక్ష పరిశోధన, ఖగోళశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ప్లాస్టిక్ సర్జరీ నుంచి మీరు ఏ శాస్త్రమైన ప్రస్తావించండి, మనవారు నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కన్నా తాము ఆద్యులు , అత్యంత ప్రతిభ కలవారు అన్న విషయం ఎప్పుడో నిరూపించారు, ఇప్పటికి నిరూపిస్తున్నారు.

పాకాశాస్త్రంలో వారు ఉపయోగించిన వివిధరకాల వంట చెరుకు నుంచి (పొట్టు,పిప్పి, బొగ్గు, కర్రలు, పిడకలు, ఇలా ఎన్నో) వారు అప్పటికే ఎంతో ప్రావీణ్యం సాధించిన లోహశాస్త్రం వల్ల పర్యావరణానికి, వినియోగదారులకు హానికరం కానటువంటి లోహాలతో వంట పాత్రలు ఎన్నో తరాలు మన్నెటటువంటి పాత్రల రూపకల్పన చేసి ఒక నిర్దుష్టమైన ప్రామాణికం నిర్దేశించారు.

వంటపాత్రలలో ఇత్తడి, ఇనుము, రాగి, మిశ్రమ లోహాలతో వివిధ రకాల వంటలకు వివిధ పాత్రలు వాడకంలోకి తెచ్చారు. లోహాలు కాకుండా సహజ సిద్ధంగా దొరికే మట్టితో, మెత్తటి రాతితో కూడా పాత్రలు వాడుకునే విధంగా రూపొందించారు.

ధనిక బీద తారతమ్యాలు లేకుండా అన్నివర్గాల వారు వీటిని వాడేవారు. కారణం ఆ పాత్రలో ఉన్న సుగుణాల వల్ల. నేను రాస్తున్నది భారతదేశంలో ఎన్నో ప్రాంతాలవారు వాడే రాచిప్ప గురించి.

ఈరోజుల్లో మీరు ఏ సూపర్ మార్కెట్టుకు లేదా స్టీల్ షాపుకు వెళ్లినా మనకు ఎన్నో ఆకట్టుకునే పాత్రలు కనువిందు చేస్తాయి.

టెఫ్లాన్, అనోడైస్డ్, అడుగున పల్చటి రాగి పొరతో పాత్రలు,
అల్లూమినియం, వివిధరకాల కోటింగ్ పాత్రలు ఊరిస్తూ ఉంటాయి. వీటిలో స్టీలు (మా చిన్నప్పుడు స్టీలు పాత్రలు కూడా తక్కువ గ్రేడ్ తో చేసి అమ్మేవారు, ఆ పాత్రలలో ఇనుము శాతం ఎక్కువగా వుండి రంగుమారిపోయేవి. వినియోగదారులు ఈ మోసాన్ని గుర్తించి ఒక చిన్న ఆయస్కాంతంతో పరీక్షించి కొనడం ప్రారంభించారు) ప్రభుత్వం కూడా స్టెయిన్లెస్ స్టీల్ ధరలు తగ్గించేసరికి ఈ తరహా మోసాలకు పాల్పడడం మానేశారు. మనం సాధారణంగా వాడే పాత్రలలో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు తప్పితే మిగతావన్ని
వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించేవే.

ఏమిటి ఈ రాచిప్ప విశేషం?

ఎప్పటినుంచి ఈ రాచిప్ప వాడకంలో ఉందొ నిర్దుష్టంగా చెప్పడం కష్టం. లోహ పాత్రల కన్నా ముందునుంచి ఉన్న వంట సామాగ్రిలో ఇదొకటి. మట్టిపాత్రలతో పాటే ఈ రాతి పాత్రలు కూడా రూపొందించి ఉండవచ్చు.

ఈ రాతి పాత్రలో చేసినటువంటి పదార్ధాలు సన్నటి సెగ మీద చెయ్యబట్టి ఐదారుగంటల పాటు చేసిన వంటకం వేడిగా ఉండడమే కాకుండా చేసిన పదార్థం లోని
ఖనిజాలు యధాతథంగా ఉంటాయి, పదార్థాలలో వేసిన సుగంధ ద్రవ్యాలు సువాసన కోల్పోయేవి కావు,
ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఒకటిన్నర రోజుల పాటు నిలువ ఉండేవి పాడవకుండా.
ఏరకమైన రసాయనిక చర్యలకు గురికాకపోవడం వల్ల ఆహార పదార్థాల రుచి మారేది కాదు.

పులుసులు, రసం, సాంబారు , గ్రేవీ కూరలు చాలా రుచిగా ఉండడం వీటి సుగుణం. ఇంకో ముఖ్య గుణం ఈ రాతి పాత్రలు బాక్టీరియా దరిచేరనిచ్చే అవకాశం లేదు. ఇంకో సుగుణం లోపలి భాగం ఎంతో మృదువుగా ఉండి వండే పదార్ధాలు లోపలి భాగంలో అంటుకోవు , కడగడం చాలా సులువు.

రాచిప్పల్లో పాలు కాచుకోవచ్చు, పెరుగు తోడు పెట్టుకోవచ్చు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు ఉదయాన్నే ఈ రాచిప్పల్లో పాలేరు పితికిన పాలు ఒక నాలుగైదు గంటలపాటు పీడకల మీద కాచి (అప్పటికి పాలు లేత గులాబీ రంగులోకి మారిపోయివుండేవి) ఆ పాలు తోడేసేవారు రాత్రి అన్నంలోకి పెరుగు కోసం. మళ్ళీ అటువంటి గడ్డపెరుగు ఎప్పుడూ తినలేదు.

ఈ కారణాలతో రాచిప్ప మన తరం ముందువరకు వంటగదిలో అంతర్భాగమైంది.

ఇరవయ్యవ శతాబ్దంలో వివిధరకాల పాత్రల ప్రవేశంతో ఈ రాచిప్ప ఉప్పు, చింతపండు,ముగ్గు లాంటి పదార్ధాలు నిలువ చేసుకునే సాధనం కింద రూపాంతం చెంది నెమ్మదిగా అందుకు కూడా పనికి రాకుండా పోయి వంటగదిలోంచి పూర్తిగా మాయమైపోయింది. ఎంతగా అంటే రాచిప్ప మనింట్లో ఉంటే మనల్ని రాతి యుగానికి చెందినవారు అనుకుంటారేమో అన్నంతగా.

గ్యాస్ మీద స్టీలు, రాగి, ఇత్తడి సత్తుగిన్నెలతో పాటు ఈ రాచిప్పకూడా కూడా వాడొచ్చు అని తెలియకపోవడం మాతరానికి ఒకరకంగా శాపంగా పరిగణించవచ్చు. లేకపోతే రాచిప్పలు బయటపడేసే వారు కాదు.

చాలామంది రాచిప్ప వేడెక్కడానికే ఇంతసేపు పడితే లోపలి పదార్ధం వేడెక్కడానికి ఇంకా ఎంతసేపు పడుతుందో, గ్యాస్ వృధా అనుకుంటారు. మొదటికొద్ది సేపు రాచిప్ప వేడెక్కిన తరువాత లోపలి పదార్ధం వేడెక్కడానికి కొద్దీ సమయం మాత్రమే పడుతుంది. తీయరీ ఆఫ్ థెరమో డైనమిక్స్ చదువుకున్నవారు సులువుగా అర్ధం చేసుకుంటారు.

ఇప్పుడు సోషల్ మీడియాలలో మనం వాడే మైక్రో వేవ్ ఒవేన్, రసాయనాలు పూసిన పాత్రల వాడకం ఇత్యాది విషయాలను అందరూ పంచుకోవడంతో, అందువల్ల జరిగే హానివల్ల, వంటగదిలోకి ఇనుప పెనం, ముకుడు, ఇత్తడి గిన్నెలు, రాగి పాత్రలు పునఃప్రవేశమౌతున్నాయి. వాటితో పాటు రాచిప్పకూడా.

ఆరోగ్యన్నీ కాపాడుకోవాలి అనుకునేవారు ఈమద్యన ఎక్కువడంతో ఈవెక్కడ దొరుకుతాయి అని ప్రశ్నిస్తున్నారు. అందుకు మీకు చివర్లో ఒక లింక్, వాట్సాప్ నెంబర్ ఇస్తాను.

రాచిప్ప కొనుక్కుంటే , వినియోగించే ముందు లోపల కొద్దిగా నునేరాసి నీళ్లు మరిగించండి , అలా చేస్తే రాచిప్ప ఎక్కువ కాలం మన్నుతుంది, అంత ఓపిక లేకపోతే అమ్మేవారు వాడకానికి సిద్ధంగా ఉన్న రాచిప్పలు కూడా అమ్ముతున్నారు కొద్దిగా అధిక ధరకు .

కొనలనుకునేవారు www.agamnaturals.com
ఈ సైట్లో కాని
Agam Naturals వారి ఫోన్, వాట్సాప్ నెంబర్
9884803554 లేదా
agamnaturals@gmail.com కు కానీ సంప్రదించండి.
మీరు ఎలా మెసేజ్ చేసినా సాఫ్ట్ స్టోన్ పాత్రల చిత్రాలు ధరలు, వివిధ సైజులు తెప్పించుకుని చూసి నచ్చితే కొనుక్కోండి.
రాచిప్పలే కాకుండా ఇతర వస్తువులు కుడా దొరుకుతాయి వీరి వద్ద. ఉదాహరణకు ఇదే తరహా మెత్తటి రాతితో చేసిన గుంతపొంగణాలు చేసుకునేది, ఇనుప ముకుడులు ఇత్యాదివి.

సుబ్రహ్మణ్యం వల్లూరి.

P. S: చిత్రాల్లో మీకు తెలుపు నలుపు రెండు రకాలు కనిపిస్తున్నాయి. రెండు ఒకే రాతితో చేసినవే. నల్ల రంగులో ఉన్నవి మీరు వెంటనే ఉపయోగించవచ్చు . తెల్లరంగు వాటిని seasoning చేసి వాడాలి

About The Author