భార్యని వేదించిన శాడిస్ట్ భర్త అరెస్ట్

తిరుపతి, అలిపిరి పోలీస్ స్టేషన్లో గురువారం దిశా పోలీస్ స్టేషన్ డి.ఎస్ఫి. రామరాజు, అలిపిరి సి.ఐ.దేవేంద్రకుమార్ లు విలేకర్లతో మాట్లాడారు.టిటిడిలో జూనియర్ అసిస్టెంట్ గ పని చేస్తున్న రేవంత్ కుమార్ కి గత నాలుగు నెలల ముందు పలమనేరుకు చెందిన నిరోషా(21) తో వివాహం జరిగిందని,పెళ్ళైన నాలుగోరోజు నుండె భార్యను వేదించడం, శారీరకంగా కొడుతూ వుండేవాడని,కొన్ని రోజులు ముందు విపరీతంగా వేదించడంతో ఆమె పుట్టింటికి వెల్లిపోవడంతో, ఇంటినుండి డబ్బులు,ధనంతో పారిపోయిందని ఆమెపై తప్పుడు పిర్యాదు చేయడంతోపాటు, తన భార్యతో ఏకాంతంతో వున్న పోటోలను వాట్సఫ్ గ్రూపుల్లో పోస్ట్ చేసి కాల్ గర్ల్ గ ప్రచారం చేసాడనే విషయం ప్రాధమికంగ నిర్దారణ జరగడంతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

About The Author