లీట‌ర్ పెట్రోల్ కు మ‌న నుండి 6 పైస‌లు…. టాయిలెట్ మెయింటేనెన్స్ కు వ‌సూలు చేస్తార‌ని మీకు తెలుసా?


లీట‌ర్ పెట్రోల్ కు మ‌న నుండి 6 పైస‌లు…. టాయిలెట్ మెయింటేనెన్స్ కు వ‌సూలు చేస్తార‌ని మీకు తెలుసా?*
లీట‌ర్ పెట్రోల్ లేదా డీజిల్ కు మ‌నం పెట్రోల్ బంక్ ల వారికి 4 నుండి 6 పైస‌లు… కేవ‌లం టాయిలెట్ నిర్వాహ‌ణ కోసం చెల్లిస్తున్నామ‌ని.!? అవును… ఇది నిజం. టాయిలెట్ మెయింటేనెన్స్ కాస్ట్ కింద అన్ని పెట్రోల్ బంక్స్ మ‌న నుండి ఈవిధంగా వ‌సూల్ చేస్తున్నాయి.
ప్ర‌తి పెట్రోల్ బంక్ లో టాయిలెట్ , మంచినీరు, ఎయిర్ ఫ్రీగా అందించాలి ఇలా అందిస్తేనే వారికి పెట్రోల్ బంక్ నిర్వాహ‌ణ‌కు అనుమ‌తి దొరుకుతుంది. చాలా మంది ప్ర‌యానంలో ఉన్న వారు టాయిలెట్ అర్జంట్ గా ఉన్న‌ప్పుడు ప‌బ్లిక్ టాయిలెట్స్ కోస‌మో… నిర్మానుష్య ప్ర‌దేశాల కోస‌మో వెతుకుతారు కానీ పెట్రోల్ బంక్ కు వెళ్ల‌రు… ఇక మీద‌ట ఎమ‌ర్జెన్సీ టైమ్ లో ద‌ర్జాగా పెట్రోల్ బంక్ ల‌కు వెళ్లండి… మీ ప‌నికానిచ్చేయండి… ఎందుకంటే అది మ‌న హ‌క్కు.!
స‌గ‌టున ఒక పెట్రోల్ బంక్ లో రోజుకు 10,000 లీట‌ర్ల చ‌మురు అమ్మితే….టాయిలెట్ మెయింటేనెన్స్ కాస్ట్ కింద ఆ బంక్ కు వ‌చ్చే అమౌంట్ రోజుకు 600…అంటే నెల‌కు 18000 …..ఈ డ‌బ్బుతో టాయిలెట్ మ‌రియు మంచినీటి సౌక‌ర్యాల‌ను అందించాల్సిన బాద్య‌త ఆయా పెట్రోల్ బంక్ ల‌దే.!

About The Author