గొర్ల పెంపకం దార్లకు ప్రభుత్వం అండ..!


రూ.3.42 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేత.
గజ్వేల్ – కోమటి బండ శివారులో గతేడాది 27వ తేదీ ఆగస్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇటీవల 117 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. జాతీయ విపత్తు నిర్వహణ కింద ప్రతి గొర్రెకు దాదాపు రూ.3 వేల చొప్పున్న ఎక్స్ గ్రేషియా మంజూరు. ఈ మేరకు గజ్వేల్ ఐఓసీలోని సీ బ్లాకులో గురువారం 6 మంది గొర్రెలు, మేకల లబ్ధిదారులకు రూ.3.42 లక్షల రూపాయలు, అదేవిధంగా వీరిలో భిక్షపతికి రూ.78 వేలు, శ్రీనివాస్ కు రూ.90 వేలు, రాములుకు రూ.57 వేలు, నర్సింలుకు రూ.45వేలు, కిష్టమ్మకు రూ.12వేలు, స్వామికి రూ.60 వేల రూపాయల చొప్పున్న ఎక్స్ గ్రేషియా అందజేత. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి గారు, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి గారు, పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి సత్యప్రసాద్ గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author