ఆన్ లైన్ క్లాసులు….తస్మాత్ జాగ్రత్త…
కరోనా మహమ్మారి దెబ్బకి మూతపడిన విద్యా వ్యవస్థ.
దీనిని గాడిలో పెట్టాలని ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులకు అనుమతులిచ్చినట్లు ఉంది.
యల్.కె.జి,యూకేజి నుండి అత్యున్నత విద్య వ్యవస్థ వరకు ప్రవేట్ విద్య వ్యవస్థ ఆన్ లైన్ క్లాసులను పెట్టడం జరుగుతుంది..
ప్రభుత్వ విద్యా రంగంలో ప్రభుత్వ అనుమతులను పాటిస్తుంటే,ప్రవేట్ విద్య వ్యవస్థ దాని తుంగలో తొక్కుతుందనే చెప్పుకోవచ్చు…
ఆన్లైన్ క్లాసులను చిన్న పిల్లలకు సైతం ప్రైవేటు రంగ విద్య వ్యవస్థలో అమలు చేయడంతో పిల్లల కండ్లు దెబ్బ తినే పరిస్థితులు మరియు అర్థం కాని పరిస్థితి లేకపోలేదు.
ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలు భారీగానే పేరెంట్స్ వద్ద నుండి ఫీజులు వసూలు చేస్తున్న సంబందిత అధికారులకు ఏమి పట్టనట్లుగానే ఉంటున్నారని పలువురు పేరెంట్స్ వాపోతున్నారు.
జిల్లా లొపలు ప్రాంతాలలో ప్రముఖ స్కూల్స్,ప్రముఖ కాలేజీలు సుమారు నెల రోజుల నుండి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది.
మరో పక్క కొన్ని చోట్ల ప్రైవేట్ విద్యా వ్యవస్థ టీచర్స్ కూలి పనులకు పోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నాయి..
మరి పేరెంట్స్ నుండి కరోనా సమయంలో వసూలు చేస్తున్న ఫీజుల డబ్బులు ప్రైవేట్ టీచర్స్ నెలవారీ జీతాలకి అందుతున్నాయా లేదనే పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ టీచర్స్ రోడ్డు పాలౌతున్నారనే వాదనలు లేకపోలేదు.
ఈ ఆన్ లైన్ క్లాసుల వల్ల పేరెంట్స్ పర్యవేక్షణ లోపం,అశ్రద్ద వహిస్తే యువత పక్కదారి పట్టే పరిస్థితులు లేకపోలేదు..
ఏది ఏమైనా ఈ ఆన్ లైన్ క్లాసుల పట్ల సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయాలని, అదే విధంగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో యువత పక్కదారి పట్టకుండా పేరెంట్స్ యువతను కను రెప్పలా చూసుకోవాలి.
జిల్లాలొ పలుప్రాంతంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో టీచర్లు,లెక్చరర్లు,ఆయాలు,సిబ్బంది,దీని పై ఆధార పడ డ్రైవర్లు వేల మందికి పైబడి ఉన్నారు.
వీరికి జీతభత్యాలు లేక,ప్రభుత్వం మరో పక్క ఆదుకోకపోగా వీరి కుటుంబాలు రోడ్డు పాలౌతున్న ఘటనలు లేకపోలేదు.
ఎందరినో ఆదుకుంటున్న ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి వీరిని కూడా ఆదుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నారు.