తిరుమలలో శ్రీదేవి కూతురు జాన్వీ పెళ్లి కల

యావత్ దేశాన్ని తన నటనతో కట్టిపడేసిన దివంగత హీరోయిన్ శ్రీదేవి. సౌత్ టు నార్త్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి అకాల మరణం అందరిని కలిచివేసింది. టీనేజ్ లో ఉన్న ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటంటూ అందరు బాధపడ్డారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తే తల్లికి తగ్గ తనయగా రాణించే ప్రయత్నాలు చేస్తుంది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. మంచి కథ అంశాలున్నా సినిమాలను చేస్తూ పరిణితి చెందిన నటిగా బ్రాండ్ ఏర్పరుచుకుంటుంది. సోషల్ మీడియాలో అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకుండే క్రేజ్ ని సొంతం చేసుకుంది.ఇక తండ్రి బోణి కపూర్ కూడా లీడింగ్ ప్రొడ్యూసర్. అయితే జాన్వీ ఇంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అయినా.. తను కూడా సాధారణ అమ్మాయిల లాగే తన పెళ్లి గురించి కలలు కంటున్నానని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

తన పెళ్ళికి సంబదించిన ఎన్నో విషయాలని మీడియాతో పంచుకుని తన కలలను తెలిపింది జాన్వీ. సామాన్య ఆడపిల్ల లానే నాకు పెళ్లి పై ఎన్నో కోరికలు ఉన్నాయని చెప్పింది. అయితే పెళ్లి కంటే ముందు బ్యాచిలర్ పార్టీని చాలా గ్రాండ్ గా చేసుకుంటానని.. తన స్నేహితులతో కలిసి దక్షిణ ఇటలీలోని కాప్రీ నగరంలో పడవలో బ్యాచిలర్ పార్టీ నిర్వహిస్తానని తెలిపింది. అయితే మా అమ్మమ్మ ఇంటి నుంచే పెళ్లి వేడుకలు మొదలవుతాయని.. అమ్మ శ్రీదేవికి చాలా ఇష్టమైన నివాసం, తన సొంత ఊరు తమిళనాడులోని మైలాపూర్ నుండే ..అమ్మమ్మ సమక్షంలో తొలి పెళ్లి వేడుకలు మొదలవుతాయని, అక్కడే సంగీత్ మెహందీ వేడుకలు కూడా ఉంటాయని, మా అమ్మ లేని లోటు లేకుండా తమ సొంత బంధుమిత్రులతో సెలబ్రేట్ చేసుకుంటేనే తనకు హ్యాపీ అని క్లారిటీ ఇచ్చింది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.

ఇక తన పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన ఇష్టదైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరా స్వామి చెంతనే జరుగుతుందని తెలిపింది. శ్రీవారి ఆలయంలో చాలా నిరాడంబరంగా పద్ధతి ప్రకారం పెళ్లి చేసువడమే తనకు ఇష్టమని పేర్కొంది. దేవుని సన్నిధిలో పెళ్లి చేసుకోవటం వల్ల స్వామి ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతానని చెప్పింది. అయితే పెళ్లిని మన భారతీయ సాంప్రదాయాలకు తగ్గట్లుగా చేసుకుంటానని తనకు కాంచీపురం చీర అంటే చాలా ఇష్టమని పెళ్లికి అదే చీర కట్టుకుంటానని తెలిపింది. అయితే రిసెప్షన్ చేసుకోవాలని లేదు అని కూడా చెప్పింది జాన్వీ. తన భర్త చాల తెలివైన వాడు ఉండాలని.. ప్రస్తుతం అయితే తనకు అలాంటి వ్యక్తులు ఎవరూ కనిపించలేదని పేర్కొంది జాన్వీ కపూర్.

About The Author