ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం..
ముంబై : ఎల్ఐసీ పాలసీల ప్రీమియంలను కట్టలేకపోయారా ? ఆ క్రమంలో… అవి రద్దయిపోయాయా ? అయినా బెంగేమీ లేదు. అలా రద్దైన పాలసీలను మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. వివరాలిలా ఉన్నాయి. ఏవైనా కారణాలవల్ల ప్రీమియంలను చెల్లించలేనిపక్షంలో ఎల్ఐసీ పాలసీలు రద్దయిపోతాయన్న విషయం తెలిసిందే. చాలామంది పాలసీదారులకు ఈ అనుభవం ఎదురవుతూంటుంది. అయితే… పాలసీలు రద్దు కావడమంటే… రెండు రకాల నష్టముంటుంది. ఒకటి… అప్పటివరకు కట్టిన డబ్బును వదులుకోవాల్సి రావడం, రెండవది… సదరు పాలసీ ప్రయోజనాలను పొందే అవకాశాలు లేకపోవడం. ఇటువంటి సందర్భాల్లో… ఆయా పాలసీల పునరుద్ధరణకుగాను ఎల్ఐసీ అవకాశం కల్పిస్తోంది. ఈ సదుపాయం అక్టోబర్ 22 వరకు ఉంటుంది.
అంతేకాదు… ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆలస్య రుసము మినహాయింపు ఇవ్వనున్నట్లు కేడా సంస్థ ప్రకటించింది. ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్, అధిక రిస్క్ ప్లాన్స్ మాత్రం ఉండవు. ఇక వైద్య అవసరాలకు మినహాయింపు లేదు. అర్హత కలిగిన ఆరోగ్య, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లపై కూడా ఆలస్య రుసుము మినహాయింపు లభిస్తుంది. కాగా… రద్దైన పాలసీలకు సంబంధించి మొదట చెల్లించిన ప్రీమియం నుంచి 5 సంవత్సరాలలో నిర్ధిష్ట పాలసీలను ప్రారంభించవచ్చునని తెలిపింది. అయితే ఇందులో కొన్ని షరతులను విధించింది. టర్మ్ అస్యూరెన్స్, మల్టిఫుల్ రిస్క్ పాలసీలు వంటి ప్లాన్లకు మినహాయింపు ఉండదు. రద్దైన పాలసీల్లో మొదట చెల్లించిన ప్రీమియం నుంచి 5 సంవత్సరాలలో నిర్ధిష్ట పాలసీలను ప్రారంభించవచ్చునని వెల్లడించింది.