భారత్ లో కాస్త శాంతించిన కరోనా కొత్తగా 2.58 లక్షల కేసులు నమోదు..
ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..
గడిచిన 24 గంటల్లో దేశంలో 2,58,089 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,018,358 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 16,56,341 కు చేరింది. ఇక దేశం లో రోజు వారీ కరోనా పాజిటివిటి రేటు 19.65 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 549 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,82,551 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,51,740 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 34,321,803 కు చేరింది. అటు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 8,209 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. అంటే నిన్నటి కంటే 6.02 శాతం ఎక్కువ పాజిటివిటీ రేటు పెరిగింది.