దీపికాపదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ సంప్రదాయాలతో ఒక్కటైన జంట….

దీపికాపదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ సంప్రదాయాలతో ఒక్కటైన జంట….

వెండితెర అందాల జంట దీపికాపదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం ఉదయం కొంకణీ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వారి వివాహ వేడుక జరగ్గా, గురువారం సింధీ సంప్రదాయంలో వారి వివాహం జరిగింది. ఇటలీలో లేక్‌ కోమోలోని డెల్‌ బాల్బియా నెల్లో రిసార్ట్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో దీపిక, రణ్‌వీర్‌ పెళ్లి జరిగింది. వధూవరులతో పాటు అతిథులు సంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు. వివాహ కార్యక్రమం సందర్భంగా ఆ రిసార్ట్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొంకణీ, సింధీ సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన వివాహ చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు.

About The Author