అన్ని జిల్లాల ఎస్ సీ అభివృద్ధి అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్…

అన్ని జిల్లాల ఎస్ సీ అభివృద్ధి అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్…

అన్ని జిల్లాల ఎస్ సీ అభివృద్ధి అధికారులు తమకు కేటాయించిన బడ్జట్ ను వీలైనంత త్వరగా ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్ సీ అభివృద్ధి శాఖ సంచాలకులు, శ్రీ. పి. కరుణాకర్ ఆదేశించారు. ఆయన శుక్రవారం సచివాలయం నుండి ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పుల ఫై అన్ని జిల్లాల ఎస్ సీ అభివృద్ధి అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్ధులు, బోర్డర్ల మానసికోల్లాసం కోసం సంగారెడ్డి జిల్లా మాదిరిగా విజ్ఞాన వినోద యాత్రలు తీసుకేళ్ళాలని అన్ని జిల్లాల ఎస్ సీ అభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు. స్పోట్స్ మీట్ లు, వార్షిక ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో ఉప సంచాలకులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి, అచ్యుతానంద గుప్త , శ్రీరామ్ విజయ పాల్ మరియు ఎస్ సీ అభివృద్ధి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author