శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ


ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం తితిదే శ్రీకారం చుట్టింది. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ధ్వజారోహణం అనంతరం వాహన సేవలు మొదలవుతాయి. వేడుకలను తిలకించేందుకు తరలివచ్చే భక్తకోటి కోసం తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. అంకురార్పణలో భాగంగా ఆదివారం ఆలయానికి నైరుతి వైపు వసంత మండపానికి శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగింపుగా వచ్చారు. అక్కడ వేదపండితులు, అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా పుట్టమన్ను సేకరించి ప్రదక్షిణగా వచ్చి ఆలయప్రవేశం చేశారు.

* శోభాయమానంగా తిరుమల క్షేత్రం

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల క్షేత్రాన్ని విద్యుద్దీపాలతో, పూల తోరణాలతో అలంకరించారు. ఫÆలపుష్ప ప్రదర్శనలో భాగంగా కంచి అత్తివరదార్‌ స్వామి సెట్టింగులు, శ్రీమహావిష్ణువు గరుత్మంతునిపై ఉన్న సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు

About The Author