మెదడును హరించే అరుదైన, ప్రాణాంతక అమీబా
న్యూయార్క్: కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతున్న అమెరికాకి తాజాగా మరో ముప్పు వచ్చిపడింది.
ఫ్లోరిడాలోని ఓ వ్యక్తికి మెదడును హరించే అరుదైన, ప్రాణాంతక అమీబాతో ఇన్ఫెక్షన్ సోకినట్టు అధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. నాగ్లేరియా ఫౌలేరిగా వ్యవహరించే ఈ అమీబా సాధారణంగా సరస్సులు, నదులు, చెరువులు, కాలువల్లోని వెచ్చటి తాజా నీళ్లలో ఉంటుందని వెల్లడించారు. ‘‘ఆ నీళ్లను ముక్కులకు తగలకుండా జాగ్రత్త పడాలి. ముక్కు రంధ్రాల గుండానే ఈ అమీబా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఇది ఎక్కువగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే విస్తృతంగా వ్యాపిస్తుంది..’’ అని అధికారులు పేర్కొన్నారు.