నేపాల్‌లో భారత న్యూస్ చానళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ : భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు నేపాల్‌లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందకు చైనా, పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ మరోసారి భారత్‌పై అక్కసు వెల్లగక్కింది. దూరదర్శన్ మినహా భారత్‌కు చెందిన అన్ని న్యూస్ చానళ్ల ప్రసారాలను గురువారం సాయంత్రం నుంచి కేబుల్ ఆపరేటర్లు నిలిపివేశారు. నేపాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.నేపాల్ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ప్రచారం హద్దులు దాటంది. ఇది చాలా దారుణం. వెంటనే ఈ చెత్తను నిలిపివేయాలి’ అని మాజీ ఉప ప్రధానమంత్రి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ట చెప్పారు