కేజ్రీవాల్ కుమార్తె హర్షితకు ఆన్లైన్లో మోసం
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితను ఆన్లైన్లో మోసం చేసిన ముగ్గురు నిందితులను దిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని సాంకేతిక నిఘా సహాయంతో అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిందితుల్లో సాజిద్ అనే యువకుడు హరియాణాకు చెందిన వాడు కాగా.. కపిల్, మన్వీందర్ సింగ్ అనే మరో ఇద్దరు యూపీకి చెందిన వారు.
ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న వారిస్ ఇంకా పరారీలో ఉన్నాడు.
ప్రముఖ ఆన్లైన్ కొనుగోలు సంస్థ ఓఎల్ఎక్స్లో సోఫాను అమ్మకానికి పెట్టారు హర్షిత. వస్తువును చూసిన ఒక వ్యక్తి ఆమెను సంప్రదించాడు.
ఆ వస్తువులను కొనుగోలు చేసిన అనంతరం ఆన్లైన్లో డబ్బు చెల్లిస్తానని చెప్పాడు.
ఈ క్రమంలో నిందితుడు హర్షిత మొబైల్కు ఒక క్యూఆర్ కోడ్ పంపి.. ఆ కోడ్ను స్కాన్ చేయగానే మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుందని నమ్మబలికాడు.
ఆ వ్యక్తి చెప్పినట్టే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే.. అమె ఖాతా నుంచి నిందితుని అకౌంట్కు నగదు బదిలీ అయిందని పోలీసులు వివరించారు. ఇలా హర్షిత మొత్తం రూ.34 వేలు పోగొట్టుకున్నట్లు తెలిపారు.