జగనన్న కాలనీ లలో అన్ని ఏర్పాట్లు 200 ఎకరాల పరిధిలో 8150 మందికి లేఔటు లో విద్యుత్ కనెక్షన్
చిత్తూరు,ఆగష్టు 12, జగనన్న కాలనీ లలో అన్ని ఏర్పాట్లు కల్పించాలని అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు.జిల్లా కలెక్టర్ చంద్రగిరి నియోజకవర్గపరిధిలోని ముంగిలిపట్టు పంచాయతీ పరిధిలోని ఎం.కొత్తపల్లి లోని 200 ఎకరాలలో నిర్మించనున్న కాలనీ ప్రాంతాన్ని పరిశీలించారు.200 ఎకరాల పరిధిలో 8150 మందికి లేఔటు లో విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లైన్లువేస్తుండగా నీటి సరఫరా కోసం 18 బోర్లను వేశారు.అదేవిధంగా ఐతేపల్లి వద్ద 45 ఎకరాలలో 945 ఇళ్లను నిర్మించనున్న ప్రాంతం పరిశీలించారు.తొండవాడ సమీపంలో గోపాలపురం వద్ద 135.16 ఎకరాల విస్తీర్ణంలో 1150ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రత్యేకచర్యలు తీసుకోవాలన్నారు.చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ 135 ఎకరాల్లో 1150 ఇళ్లకోసం నిర్మాణంజరుగుతున్నదని ఇక్కడ సమావేశ భవనం,వృద్దులకు విశ్రాంతిభవనం,మహిళా శక్తీ భవనం,కూరగాయల మార్కెట్,వాకింగ్ ట్రాక్,ప్రాథమికఆరోగ్యకేంద్రం వంటి నిర్మాణాలతో పాటు సుందరమైన పార్క్ ను నిర్మించనున్నట్లు తెలిపారు.ఇళ్ల నిర్మాణాలు భారీ ఎత్తున జరుగుతున్న ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర తో మాట్లాడుతూ సిమెంట్,ఇనుము,ఇసుక ఈ ప్రాంతంలోకి అందించేలా చర్యలుతీసుకోవాలని ఆదేశించారు.రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని తిరుపతి ఆర్ డి ఓ కనక నరసారెడ్డి ని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పలువురుఅధికారులు పాల్గొన్నారు.
డి డి సమాచార శాఖ,చిత్తూరు చే జారీ