క్రైమ్ రివ్యూ మీటింగ్ (నేర సమీక్షా సమావేశం),తిరుపతి అర్బన్ జిల్లా:

కేసు నమోదు చేసినంతమాత్రానా సరిపోదు – త్వరితగతిన దర్యాప్తు చేసి భాధితులకు న్యాయం చేయాలి.*

*టెక్నికల్ డి.ఐ.జి శ్రీ పాల్రాజ్, ఐ.పి.యస్ గారు…* 

*తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్…*  

తిరుపతి అర్బన్ జిల్లా మహిళా యూనివర్సిటీ సావేరి హాల్ నందు అర్బన్ జిల్లా పోలీస్ అదికారులతో  నేర సమీక్ష సమావేశం తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏ.పి టెక్నికల్ డి.ఐ.జి శ్రీ పాల్రాజ్, ఐ.పి.యస్ గారు పాల్గొని CCTNS (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ & సిస్టం) నందు తెలుసుకోవాల్సిన విషయాల గురించి వివరించి పలు సూచనలు సలహాలు తెలియజేసారు.

 డి.ఐ.జి గారు:

    ప్రతి పోలీస్ వారు ముందు ఏ విభాగంలో పని చేస్తున్నామో తెలుసుకోవాలి.

    స్టేషన్ నందు రిపోర్ట్ అయిన కేసుల గురించి ముందుగా అవగాహన చేసుకోవాలి. దాని ప్రకారం దర్యాప్తు చేయాలి.

         నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి

    మీ పాత్రా ఏమిటి? మీరు ఏమి చేయాలి అన్న దానిపై అవగాహన కలిగిఉండాలి.

    కేసు దర్యాప్తు ప్రారంభించడానికి ముందు ముద్దాయి యొక్క నేర చరిత్ర గురించి తెలుసుకోవాలి.

    OV క్రిమినల్స్ కదలికలు తెలుసుకోవాడానికి CCTNS చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

    అలవాటుపడిన నేరస్తుల గురించి తెలుసుకుకోవడానికి CCTNS చాలా ఉపయోగకరమగా ఉంటుంది.

    కేసు దర్యాప్తు ప్రారంభించడానికి ముందు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. కేసు వెనుక ఉన్న మూలాలను తెలుసుకోవాలి. అప్పుడు పురోగతి సాదించగలుగుతాం.

కేసు ధర్యప్తుల్లో నాణ్యత ఉండాలని స్టేషన్ కు వచ్చు ప్రజలు, భాదితులు పట్ల స్నేహభావంతో మాట్లాడాలని, సహనం చాలా అవసరం మన మాట తీరులోనే సగం కేసు పూర్తి అవుతుంది. కేసుల ధర్యప్తుల్లో CCTNS, 3నేత్ర యాప్ లు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా డి.ఐ.జి గారు తెలిపారు.

 జిల్లా యస్.పి:

    *మన వ్యక్తిగతం మీదే కేసు దర్యాప్తు ఆధారపడి ఉంటుంది.* 

            ధర్యప్తుల్లో నాణ్యత ఉండాలి

    *కేసు నమోదు చేసినంత మాత్రానా సరిపోతుందని అనుకోకూడదు. భాధితులకు తగిన న్యాయం చేయాలి.*

       కేసులుపట్ల శ్రద్ద చాలా అవసరం.

    *మనమల్నే నమ్ముకుని, మనమే దిక్కని భాదితులు వస్తారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు.* 

    *ఉన్నది ఉన్నట్లుగా చేయండి, సహాయకారిగా కాకపోయినా మన వల్ల అపకారం మాత్రం జరగకూడదు.*

    *నైపుణ్యాన్ని పెంచుకొని కేసుల్లో పురోగతి సాదించాలి.*

    *స్టేషన్ రికార్డులను సక్రమైన మార్గంలో నడపాలి. లాక్ అప్ కు మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో స్టేషన్ విధి విధానాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి.*

    *స్టేషన్ కు వచ్చు వారిని వీలైనంత వరకు వారి సమస్యలను విని పరిష్కరించి సమాదానం తెలిపి త్వరితగతిన వారిని పనిపివేయాలి.*

    *అధికారులు అందుబాటులో ఉన్న సిబ్బందితో వీలైనంత వరకు సమయస్పూర్తితో విధులను నడిపించాలి.*

    *విధులను స్టేషన్ లోని సిబ్బంది అందరు ఏ పని అప్పగించినా చేసే విధంగా సిబ్బందిని తర్పీదు చేయాలి. తెలియనివారికి తెలియపరిచి ఒకరు లేకపోయినా విధులు నడిచే విధంగా చూడాలి.*

    *క్రైమ్ నేరాలపై అలసత్వం పనికిరాదు. సమాచారం అందిన వెంటనే స్పందించి నేరస్థలంను పరిశీలించాలి, నేరములు ఎక్కువగా జరుగు ప్రాంతాలను గుర్తించి నివారణ కొరకు తగు చర్యలు తీసుకోవాలి.*

    *అధికారులు ప్రతిరోజు స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వారి సమస్యలపై సమీక్షించాలి.*

    *నిజం కన్నా అపద్దం చాలా త్వరగా ముందుకు వెళుతుంది. నీ నడవడికపై నీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది.*

    *దిశా, SOS కాల్స్ పై దృష్టి సారించాలి. SOS కాల్స్ వచ్చిన వెంటనే స్పందించాలి.*

    *మహిళా విశ్రాంతి సముదాయాలు, హాస్టల్స్, కాలేజీల వద్ద భద్రత పెంచాలి.*

    *విసిబుల్ పోలీసింగ్ ఉండాలి. భహిరంగ ప్రదేశాలలో మత్తు పదార్థాలు సేవించు వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.*

ప్రతి కేసులో ఏదో ఒక చిన్న దారం ఉంటుంది. అదే మనకు ఆయుధం. చిన్న ఆధారం ఉంటె చాలు ఎంతటి కేసునైనా చేధించవచ్చు. లాక్ అప్ పట్ల శ్రద్ద వహించాలి. ఎవరిని అనవసరంగా స్టేషన్ కు పిలిపించాకూడదు. ఒకవేళ వచ్చిన త్వరగతిగా మాట్లాడి సమస్యలుంటే పరిష్కరించి పంపివేయాలి. విసిబుల్ పోలీసింగ్ చాలా అవసరం. రాబోవు కాలం పండుగ దినాలు బ్రహ్మోత్సవాలు, జాతరలు మొదలగునవి వస్తుంది. వాటిపై ముందస్తు జాగ్రత్తగా తగిన ప్రణాళిక సిద్దం చేసుకోవాలని తెలిపారు.

గ్రామ, వార్డు మహిళా పోలీస్ వారితో సమన్వయముతో విధి విధానాలు ఏర్పాటుచేసుకొని ముందుకు వెళ్ళాలి. SOS కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని భాధితులకు అండగా ఉండాలని తెలిపారు.

నేర సమీక్ష సమావేశంలో విచారణలో ఉన్న కేసులను మరియు పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో  ఉన్న పిర్యాదులను పరిశీలించి వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్వరితగతిన పూర్తిచేయాలని, స్టేషన్ పరిదిలో ఎక్కువ నేరములకు తీవ్రమైననేరాలకు పాల్పడిన వారిపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలనీ, రౌడీ షీటర్లపై ప్రత్యేకమైన  నిఘా ఉంచాలి. 

కేడీలు డి.సి.లు, బి.సి.లను తరువుగా చెక్ చేసి వారం వారం యస్.పి కార్యాలయానికి రిపోర్ట్స్  మరియు వారి నమోదు పట్టిక పంపాలని సూచించారు. దొంగతనాలుజరగకుండా ముఖ్యమైన ప్రాంతాలలో తగిన బీట్లు, పికట్స్, లర్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకొని   అధికారులు  తరువుగా  బీట్ చెక్ చేసుకొని సిబ్బందికి సూచనలుఇవ్వాలని అలాగే దొంగతనాలను అరికట్టాలని,  స్టేషన్ కు వచ్చు పిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికీ తగిన న్యాయం చేయాలనీ ఎలాంటిపరిస్తితులైన ఎదుర్కొనేందుకు సిబ్బంది మరియు అధికారులు సిద్దంగా వుండాలని, మిస్సింగ్ కేసులు వచ్చిన వెంటనే త్వరిగాతిగా స్పందించి చర్యలు తీసుకోవాలని, వీలైనంతవరకు లోకలాదత్ ద్వారా కేసు లను తగ్గించాలని, సూసించారు. అవసరమైనచో సమన్వయంతో ఇతర జిల్లాల  అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని సూసించారు.

ఈ సమావేశంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్ శ్రీమతి ఇ.సుప్రజ మేడం గారు, L&O శ్రీ అరిఫుల్లా గారు, తిరుమల శ్రీ మునిరామయ్య గారు, డి.యస్.పి లు, సి.ఐ.లు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.  వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిదిలో కేసు పురోగతి యందు ఉత్తమ ప్రతిభ కనుబరిచిన వెస్ట్ సి.ఐ శివ ప్రసాద్, యస్.ఐ లు చలపతి, వినోద్ కుమార్, హెచ్.సి రవి ప్రకాష్, పి.సి లు స్వయం ప్రకాష్, రమేష్, దిలీప్, రఘుదీప్, ప్రతాప్, రెడ్డి గంగాధర్, హోంగార్డ్ రాజేంద్ర మొదలగు వారికి టెక్నికల్ డి.ఐ.జి మరియు యస్.పి గారిచే మేమొంటో అందుకున్నారు.

 వివిధ కేసులలో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రతిభ ఆధారంగా శోభిత, స్పందన, శోధన అను మోమెంటోలను జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు అందజేశారు.

*శోభిత:*- 1.తిరుమల I టౌన్ సి.ఐ జగన్మోహన్ రెడ్డి, 2.రేణిగుంట సి.ఐ శ్రీమతి అంజు యాదవ్, 3.తిరుచానూరు సి.ఐ సుధాకర్ రెడ్డి, 4.ఏ.యస్.ఐ ఏ.వి శ్రీధరన్ యస్.బి, 5.ఏ.యస్.ఐ కే.సోమల నాయక్ యస్.బి, 6.హెచ్.సి టి.సుబ్రమణ్యం రెడ్డి యస్.బి, 7.హెచ్.సి సుబ్రమణ్యం రాజు యస్.పి.  I

*శోధన:*- 1.కే.చెంద్ర శేఖర్ సి.ఐ తిరుమల, 2.కే.బి.శివకుమార్ యస్.ఐ తిరుమల, 3.టి.మురలి హెచ్.సి, 4.యన్.సుబ్రమణ్యం హెచ్.సి, 5.డి.సుబ్రమణ్యం పి.సి, 6.సుబ్బా రెడ్డి పి.సి, 7.పి.రామచంద్రా రెడ్డి పి.సి, 8.ఓ.వెంకటరమణ పి.సి.