క్యాన్సర్‌కు చెక్ పెట్టిన సైంటిస్టులు.. సూపర్ వ్యాక్సిన్ వచ్చేసింది..


క్యాన్సర్‌ వ్యాధి రాకుండానే దాన్ని నాశనం చేసే సూపర్ వ్యాక్సిన్ను మసాచుసెట్స్ అమ్హెర్స్ట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగం చేశారు.

ఎలుకల్లో ప్రాణాంతక వ్యాధి ఏర్పడకుండా పూర్తిగా నిరోధించే విధంగా ఈ ‘సూపర్ వ్యాక్సిన్’ను అభివృద్ధి చేశారు. ప్రత్యేక రోగనిరోధక శక్తిని పెంచే ఫార్ములాతో నడిచే ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్, జంతువుల రోగనిరోధక వ్యవస్థలు క్యాన్సర్ కణాలను కణితులుగా పెరగకముందే గుర్తించి నాశనం చేయడంలో సహాయపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అనేక పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. ఎలుకలపై -ఈ సూపర్ వ్యాక్సిన్ వేయగా అవి ఆరోగ్యంగా ఉన్నాయి. టీకాలు వేయని వాటిలో క్యాన్సర్ అభివృద్ధి చెందిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

వ్యాధి శరీరమంతా వ్యాపించకుండా..

ఈ సూపర్ వ్యాక్సిన్ మెలనోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ టీకాను ఎలుకలపై వేయగా.. క్యాన్సర్ శరీరం పట్టుకుని అంతటా వ్యాపించే ముందు దానితో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఈ టీకా కొత్త కణితులను నిరోధించడమే కాకుండా వ్యాధి శరీరమంతా వ్యాపించకుండా చేస్తుంది. ఈ టీకా సూపర్ అడ్జువెంట్ అని పిలిచే ఒక ప్రత్యేకమైన పదార్ధంతో ఏర్పడటం వల్ల క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది సాధారణ టీకాల కంటే రోగనిరోధక శక్తిని సూచిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. జంతు అధ్యయనాలలో ఫలితాలు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, మానవ పరీక్షలు ఇంకా జరగాల్సి ఉందని తెలిపారు.

About The Author