కొత్తగా వాహనాలు కొన్నవారికి శుభవార్త …
కొత్త వాహనం కొన్నాక రిజిస్ట్రేషన్ తర్వాత చేయించుకుంటాం అంటారు వాహనదారులు. ఉద్యోగాల్లో బిజీగా వుండి టైం దొరికినప్పుడు వెళ్లి రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నిస్తారు. ఆర్టీఏ కార్యాలయంలో రద్దీ ఎక్కువ వుంటే చాలాసార్లు తిరగాల్సి వస్తుంది. ముందుగా షోరూమ్ వాళ్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ కింద టీఆర్ నంబర్ ఇస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీనికి కొంత ప్రాసెస్ వుంటుంది. ఆ ప్రాసెస్‌లో వాహనదారుడు కొంత సమయాన్ని వెచ్చించాల్సి వుంటుంది. ఇకపై అలాంటి రిస్క్ లేకుండా వాహనదారులకు ఊరట కల్పించే జీవో ఒకటి విడుదలైంది వాహనం కొనుగోలు అనంతరం శాశ్వత రిజిస్ట్రేషన్ (PR), హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు లభించబోతోంది. అందుకు సంబంధించిన జీవో విడుదల అయింది. ఇక తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) వుండదు. ఒకేసారి శాశ్వత రిజిస్ట్రేషన్ జరిగిపోతుందన్నమాట. వాహనంతో షోరూమ్ బయటకు పూర్తి రిజిస్ట్రేషన్‌తో రావచ్చు. ఒకేసారి పీఆర్, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ వచ్చేస్తుంది. ఇంకే తర్వత ఆర్టీఏ కార్యాలయాలకు తిరగే పని వుండదు. ఈ విధానం అమల్లోకి వస్తే సమయం, సొమ్ము కూడా ఆదా అవుతాయి. ఈ విధానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తుండగా దాన్ని తెలంగాణలో కూడా త్వరలోనే అమల్లోకి తేవాలని రవాణా శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నామని రవాణాశాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు