మీకు బుల్లెట్ బైక్ ఉందా..? అయితే ఈ వార్త మీకోసమే..


రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన వాహన శ్రేణిలోని 7వేల బుల్లెట్‌, బుల్లెట్‌ ఎలక్ట్రా వాహనాలను వెనక్కి రప్పించింది. బ్రేకింగ్‌ వ్యవస్థలో లోపాలు ఉండటంతో సదరు వాహనాలను వెనక్కి పిలిపించినట్లు తెలిపింది. మార్చి 20, 2019, నుంచి ఏప్రిల్‌ 30, 2019 మధ్య తయారైన వాహనాల్లో బ్రేక్‌ కాలిపర్‌ బోల్ట్‌ సరిగా పనిచేయకపోవడంతో సమస్య తలెత్తినట్లు గుర్తించామని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తెలిపింది. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా బ్రేక్‌ కాలిపర్‌ బోల్ట్స్‌ లేకపోవడంతో వాటిని సరిచేయనున్నట్లు పేర్కొంది. సమస్య ఉన్న బులెట్లను స్వచ్ఛందగా సర్వీస్‌ చేయనున్నట్లు వెల్లడించింది.

About The Author