నిత్యా పెళ్లికూతురు కటకటాల పాలు…
నిత్యా పెళ్లికూతురు కటకటాల పాలు…
కట్నం కోసం కక్రుర్థి దొంగ పెళ్లిళ్లు చేసుకునే మొగళ్లను చూసాం,కానీ తను కూడా తక్కువేం కాదని ఏకంగా అయిదు దొంగ పెళ్లిళ్లు చేసుకుని కలియుగ ద్రౌపది అనిపించుకుంది.విచిత్రం ఏమిటంటే అన్ని పెళ్ళిళ్ళు కన్నా తండ్రే చేసాడు.
వివాహ వ్యవస్థ, కాపురం,భార్య భర్తల అనే సంబంధాలకు సమాజంలో ఉన్న విలువల్ని కూని చేసి దర్జాగా మోసం చేసింది.డబ్బు,బంగారం కోసం ఎలా మొగళ్లను మార్చుతూ అందినకాడికి నొక్కేసింది.ఇక అసలు వివరల్లోకెళ్తే ప్రకాశం జిల్లా మోదినీపురంకు చెందిన మౌనిక బట్టలు మార్చింత సులువుగా భర్తలను మార్చింది. కడప జిల్లా ఖాజీపేటకు చెందిన భూమిరెడ్డి రామకృష్ణ రెడ్డి తో మూడు నెలల క్రితం మౌనిక కు వివాహం అయింది.అమ్మాయి అందంగా ,బాగుందని కట్నం కానుకలు ఎం లేకుండా ఘనంగా వివాహం జరిపించారు అత్తింటివారు.అంత హ్యాపీగా సాగుతున్న టైం లో మౌనిక తండ్రివచ్చి తన కూతురును పుట్టింటికి తీసుకెళుతున్నాను అని తీసుకెళ్లాడు.అంతే అలా వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు,ప్రకాశం జిల్లా మౌనిక ఇంటికి వెళితే ఇంటికి తాళం వేసి ఉంది,చుట్టుపక్కల వాళ్ళని బంధువులను ఎంక్విరీ చేస్తే తమకేం తెలియదని చెప్పారు. తండ్రితో వెళ్లి మౌనిక పుట్టింటికి వెళ్ళాక తన ఇంటికి రాకపోవడం తో ఎం చేయాలో తెలియని రామకృష్ణ రెడ్డి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.తండ్రి కూతురు ఇద్దరు కనిపించక పోవడం తో పొలిసులు కూడా సీరియస్ గా తీసుకుని ఎంక్విరీ చేయడం మొదలు పెట్టారు.ఇద్దరి ఫోన్ నెంబర్ లను నిఘా పెట్టి విజయవాడ, విశాఖపట్నం లలో ఉందని ముందుగా అనుకున్న అక్కడ నుండి చివరకు హైదరాబాద్ వెళ్లినట్టు ఫోన్ సిగ్నల్ ఆధారంగా కనిపెట్టారు పోలీసులు. చివరికి హైదరాబాద్ లో ఇంకా వ్యక్తితో కాపురం ఉంటున్న మౌనికను,ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని కడపకు తీసుకువచి విచారిస్తే పోలీకే మైండ్ బ్లాంక్ అయింది.మౌనిక ఇప్పటికే అయిదు పెళ్లిళ్లు చేసుకుందని,ఇప్పుడు మరో యువకుడితో హైదరాబాద్ లో కాపురం పెట్టిందని తెలిసింది.
ఆరుగురు ని పెళ్లి చేసుకున్న అభినవ ద్రౌపది మూలత్తం కథ పోలీస్ లు వెల్లడించారు.మొదట ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని కొన్ని రోజులకే వదిలేసింది, తరువాత అదే జిల్లా పందిళ్ళ పెళ్లికి చెందిన వ్యక్తిని రెండోపెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత మూడో పెళ్లి గిద్దలూరుకు చెందిన వ్యక్తితో, నాలుగో పెళ్లి తెనాలికి చెందిన వ్యక్తితో చేసుకుంది. ఐదో పెళ్లి కడప జిల్లా వ్యక్తి రామకృష్ణారెడ్డిని చేసుకోవడం ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం తో అసలు సంగతి బయట పడింది.రామకృష్ఱారెడ్డిని కూడా వదిలేసిన వెళ్లిన తరువాత విజయవాడలో హైడ్ కు చెందిన యువకుడితో పరిచయం కావడంతో అతన్ని అన్నవరంలో పెళ్లిచేసుకుని హైదరాబాదు లో కాపురం స్టార్ట్ చేసింది. కిలాడి మౌనిక పెళ్లి చేసుకున్న భర్తలతో ఒక నెలా లేదా కొన్నిరోజులు కాపురం చేసి అత్తింటి నుంచి బంగారం, డబ్బులతో అందినకాడికి తీసుకొని పరారు అయ్యేది.అయితే అన్నీ పెళ్ళిలలో తండ్రి అనంతరెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మౌనిక పై 420 కేసును నమోదు చేశారు పోలీసులు.