జన నాట్యమండలి స్థాపకుడు, కవి, రచయిత వంగపండు ప్రసాదరావు(77) కన్నుమూత…


గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న *వంగపండు* విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాసవిడిచారు… 1972లో అప్పటి *పీపుల్స్‌వార్ గ్రూపు* కు మద్దతుగా సహచరులు *గద్దర్,బి.నర్శింగరావు* లతో కలిసి *జన నాట్యమండలి* అనే సాంస్కృతిక విభాగాన్ని ఏర్పాటు చేసారు… సామాజిక సమస్యలపై తన పాట, గజ్జె కట్టి ఆటల తో ప్రజల్లో చైతన్యం కలిగించాలని ప్రయత్నించే వారు… *జజ్జనక జనారే…*, *ఏంపిల్లడ ఎంల్దాం వస్తవా…*, *యంత్రమెట్టా నడుస్తుందంటే…* వంటివి అత్యంత ప్రజాదరణ పొందిన వంగపండు ఆట,పాటల్లో కొన్ని…

About The Author