పంచాయతీ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన SEC నిమ్మగడ్డ


రాజ్యాంగ ఆదేశాల మేరకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం విధి

వివిధ కారణాల వల్ల ఇప్పటికే జాప్యం జరిగింది

సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది

రాష్ట్ర హైకోర్టు లో ప్రభుత్వం, ఎన్నికల సంఘం తమ‌వాదనలు వినిపించాయి

కమిషన్ కు న్యాయ. వ్యవస్థ పై విశ్వాసం, విధేయత ఉన్నాయి

నాలుగు విడతలుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి

6.30నుండి 3.30 వరకు పోలింగ్ ఉంటుంది

ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తి గా ఉన్నాయని కమిషన్ భావిస్తుంది

మధ్యాహ్నం జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో అభ్యంతరాలు చెప్ప‌వచ్చు

సి.యస్., డిజిపి, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొంటారని ఆశిస్తున్నాం

రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ పని తీరు మరింత మెరుపడాల్సి ఉంది

అపరిష్కృతంగా జిల్లాల్లో సమస్యలు ఉండటం శోచనీయం

పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి పని లో విఫలమవ్వడం బాధాకరం

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ బాధ్యత తో నే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నాం

నిన్న అధికారులకు మూడు సార్లు సమయం ఇచ్చినా రాలేదు

3.6లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారు

ఇందుకు పంచాయతీ రాజ్ శాఖ అలసత్వం కారణం

దీనికి సంబంధించిన అధికారులు పై‌సరైన సమయంలో చర్యలు ఉంటాయి

ఎన్నికలు జరపాలనే పూర్తి విశ్వాసం తో కమిషన్ ముందుకు పోతుంది

ఈరోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ఆవిష్కృతమైంది

గవర్నర్ తో, సియస్ తో జరిపిన సంప్రదింపులు మేము బహిర్గతం చేయలేదు

కానీ సియస్ నాకు రాసిన లేఖ నాకన్నా ముందుగా మీడియా లో వచ్చింది

ఇటువంటి విధానం సరి కాదు.. నిబంధనలు ప్రకారం అధికారులు నడుచుకోవాలి

ఎన్నికల పై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి

వాటిని పరిగణలోకి తీసుకునే అన్ని రకాల చర్యలు కమిషన్ తీసుకుంది

స్వేచ్వాయుత వాతావరణం లో ఎన్నికలు జరగాలని భావిస్తున్నాం

కరోనా పరిస్థితి లో జాగ్రత్త లు పాటిస్తూ నే ఎన్నికల‌ విధుల్లో పాల్గొంటారని భావిస్తున్నాం

స్థానిక సంస్థల కు విధులు, నిధులు ఎన్నికల ద్వారా నే చేరతాయి

అందుకే అందరూ ఎన్నికల నిర్వహణ కు సహకరించాలి

ఏకగ్రీవాల పై కూడా ఒక అధికారిని నియమించి విచారణ చేయిస్తాం

ఎన్నికలకు సంబంధించి విధులు, నిధుల సమస్యలు ఉన్నాయి

కోర్టు దృష్టి కి తీసుకెళ్లాం, గవర్నర్ దృష్టి కి స్వయంగా వివరించాం

ప్రభుత్వానికి బలమైన సూచన చేసి నిధులు ఇవ్వాలని‌ గవర్నర్ ను కోరాం

అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు, సహకరించడం లేదు

సిబ్బంది కొరత ఉన్నప్పటికీ అన్ని అవరోధాలు అధిగమించి నిర్వహిస్తాం

ఇది మాకు సవాల్ అయినా… ముందుకు సాగుతాం

దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నికలు జరిగాయి, జరుగుతున్నాయి

ఎపి లో మాత్రమే ఎన్నికలు‌ వద్దని కోరటం కరెక్ట్ కాదు

ప్రజా పాలన లేకుంటే..‌అనేక దుష్పలితాలు ఉంటాయి

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లు ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలి

ఇందులో విఫలమైతే…‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది

సుప్రీం కోర్టు లో సోమవారం కేసు వస్తున్న నేపధ్యంలో లో అవసరమైతే.. కమిషన్ నివేదిస్తుంది

ఈ‌ పంచాయతీ ఎన్నికల ను చారిత్రిక ఎన్నికలుగా గుర్తించాలి

ప్రజల్లో ఎన్నికల పై ఆసక్తి ఉంది..‌జరగాలనే కోరుకుంటున్నారు

ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరి కాదు

జనవరి‌25 జాతీయ ఓటర్ల దినోత్సవం, 26 గణతంత్ర వేడులు

ఇటువంటి పరిస్థితి లో రాజ్యాంగ బద్దంగా అందరూ నడవాలి

ఉన్న సవాళ్లను అధిగమించి రాజ్యాంగ స్పూర్తి తో పని చేస్తాను

ఎన్నికలు వాయిదా వేయాలనే విజ్ఞప్తి లో హేతు బద్దత లేదు

గవర్నర్ నుంచి మాకు పూర్తి సహకారం ఉంటుందని ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాం

About The Author