కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) డాక్టర్ చింతామోహన్ కామెంట్.


?ఎన్నికల కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం, ఇవన్నీ పరిపాలనలో లోపాలు, అనుభవం లేని నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఎవరో, తిరుపతి SP ఎవరో తెలియని పరిస్థితి.

BJP
*****
? అన్నమో రామచంద్ర అని ప్రజలు అల్లాడుతుంటే ఛలో రామతీర్థం అంటూ BJP, TDP నాయకులు ఉరుకులు, ఇవన్నీ అగమ్యగోచరంగా ఉన్నాయి.

? రాష్ట్రంలో 1000 పెద్ద దేవాలయాలు, మరో లక్ష చిన్న దేవాలయాలు ఉన్నాయి. వీటన్నిటికీ రక్షణ కావాలంటే దేశంలో ఉన్న మిలటరీని ప్రతి దేవాలయం ముందు ఉంచాలి.

? ఒకాయన హైదరాబాద్ నుంచి ఖురాన్, భగవద్గీత మధ్య యుద్ధం అంటాడు. మరొకరు బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అంటాడు. నాలుగు ఓట్లు కొరుకు ఇంత యుద్ధం అవసరమా??

? మనిషికి కావాల్సింది కూడు, గుడ్డ, గూడు. మహాయితే ఉద్యోగం. ఇవి చూడకుండా ఉరుకులు, పరుగులు తీస్తుంటే విచక్షణ కోల్పోయినట్టు అనిపిస్తుంది.

?దేశంలో మత సామరస్యం అవసరం. మతాల మధ్య వివాదాలు కాదు.

డిల్లీ
*****
? భారతదేశ రాజధానికి నాలుగు దిక్కుల్లో 4 లక్షల మంది రైతులు 50 కిలోమీటర్లు పొడవునా ట్రాక్టర్లు. ప్రతి ట్రాక్టర్లో వందల మంది రైతులు గత 60 రోజులుగా రోడ్లపైన అన్నదాతలు చలి, వర్షంలో 200 మంది చనిపోవడం, ఇవన్నీ దేశంలో ఆందోళన, అలజడి కలిగిస్తున్నాయి. దీనికి కారణం 3 నల్ల చట్టాలు, రైతులు, సామాన్యులకు ఉరితాడులాంటివి. ఇప్పటికే 11 సార్లు సంప్రదింపులు అయినా BJP మొండి వైఖరే గమనార్హం.

చంద్రబాబు
***********
14 సంవత్సరాలు CM గా చేసింది సున్నా. 4 లక్షలు ఉచితంగా 7008 మంది నిరుపేద మహిళలకు వచ్చిన 292 కోట్లు ఏమి చేశారో తెలియదు.
? లక్ష మంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇచ్చే దుగరాజపట్టణం ఓడరేవు రాకుండా జాబు రాసి ఆపారు. ఈ రోజు సైకిల్ ర్యాలీ చెయ్యడం విడ్డూరం గా ఉంది.

తిరుపతికి YCP, BJP, TDP ఏమి చేశాయి??

చేసింది లేకపోయినా ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప, తిరుపతి అభివృద్ధికి ఏదైనా చేసింది అంటే ఒక్క భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

About The Author